Janaki Kalaganaledu: జెస్సి గర్భవతి అని తెలుసుకున్న జానకి.. అబార్షన్ చేయించుకో అంటూ అఖిల్ వేధింపులు!

Published : Sep 01, 2022, 01:36 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
16
Janaki Kalaganaledu: జెస్సి గర్భవతి అని తెలుసుకున్న జానకి.. అబార్షన్ చేయించుకో అంటూ అఖిల్ వేధింపులు!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అఖిల్ బండి తీసుకొని జెస్సి దగ్గరికి వెళ్తాడు.జెస్సి కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో విషయం చెప్పావా? ఒప్పుకున్నారా?  ఇంట్లో ఏమని చెప్పాలి అని అడగగా మా ఇంట్లో నేను చెప్పలేదు. చెప్పినా ఒప్పుకోరు ప్రస్తుతానికి నువ్వు అబార్షన్ చేసుకో ,చదువు అయిపోయిన తర్వాత నేను ఎలాగైనా ఒప్పిస్తాను అని అంటాడు. దానికి జెస్సీ చాలా బాధపడి ఇంట్లో విషయం తెలిసిపోయింది దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నారు ఇంట్లో నా పరిస్థితి ఏం బాలేదు నా గురించి కూడా ఆలోచించట్లేదు అని అంటుంది.
 

26

అప్పుడు అఖిల్, నీకు నేను కావాలన్నా, నా ప్రేమ కావాలన్నా ప్రస్తుతానికి కడుపుని తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెస్సి ఏడిచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జానకి రామా రోడ్డుమీద కూరగాయలు కొంటూ ఉంటారు. ఇంతలో రామా జానకి కి గాజులు కొనడానికి వెళ్తాడు. అప్పుడు జెస్సి నడుస్తూ ఉంటుంది.వెనకాతల వాహనం జెస్సీ నీ గుద్దేయబోయింది. జానకి వెళ్లి కాపాడుతుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావ్ జెస్సి చూసుకోవాలి కదా రోడ్డుమీద అని జానకి అంటుంది.
 

36

అఖిల్ చేసిన పనికి నేనేం చేయాలి అక్క, అఖిల్ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని అంటుంది. అప్పుడు జానకి ఆశ్చర్యపోయి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి వాడికైతే బుద్ధి లేదు ఆడదానివి నీకైనా బుద్ధి ఉండాలి కదా అని అంటుంది. జెస్సి, చాలా బలవంతం పెట్టాడు అక్క, ఇంట్లో వాళ్లకు కూడా తెలిసిపోయింది. నా కడుపుకి కారణం ఎవరు అని ఇంట్లో వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అఖిల్ కి చెప్తే కడుపు తీసేసుకోమంటున్నాడు.
 

46

నువ్వే నాకు ఏమైనా సహాయం చేయక్క,నువ్వే నా దగ్గర ఉన్న చివరి అవకాశం అని అంటుంది జెస్సీ. అప్పుడు జానకి మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని అడగగా జెస్సి ఉన్నాయి అని ఫోన్ లో అఖిల్ జెస్సీ ల ఫోటోలను చూపిస్తుంది. ఇవి నాకు తర్వాత పంపు అని చెప్పి,నేను ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను అని జెస్సిని ఆటోలో ఇంటికి పంపుతుంది. అంతలో రామకి ఏదో బేరం దొరికిందని, నేను స్వీట్ షాప్ కి వెళ్తాను మీరు ఆటోలో వెళ్లిపొండి జానకి గారు అని జానకిని ఆటోలో పంపిస్తాడు.
 

56

 ఆ తర్వాత జానకి ఇంటి బయట ఉంటుంది.అప్పుడు అఖిల్ ఇంటికి వస్తాడు.నీతో మాట్లాడాలి అని జానకి అనగా ఆకలేస్తుంది వదిన తినేసి మాట్లాడుదామని అంటాడు అఖిల్.నువ్వు తినేసి వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను అని జానకి అంటుంది కానీ అఖిల్ మాత్రం లోపల ఇంట్లో వాళ్ళ అందరితో క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత రామా అక్కడికి వస్తాడు.లోపలికి వెళ్దాం జానకి గారు అని జానకిని లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ అఖిల్ ఆనందంగా ఆడుతూ ఉండడం చూస్తుంది.
 

66

జానకి కి కొట్టేంత కోపం వస్తుంది కానీ అందరూ ఉన్నారు అని ఆగిపోతుంది. ఏమైంది జానకి అక్కడే ఉండిపోయావు లోపలికి రా అని  జ్ఞానాంబ అంటుంది. అప్పుడు అఖిల్ జానకిని చూసి మొఖం కిందకి దించేసుకుంటాడు.జానకి మాత్రం అఖిల్ నే చూస్తూ ఉంటుంది. మల్లిక వాళ్ళ ఇద్దరి వైపు అనుమానంతో చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories