విశ్వక్సేన్ ఇంట్లో భారీ చోరీ!, ఎలా జరిగిందంటే

Published : Mar 16, 2025, 11:19 AM IST

హీరో విశ్వక్సేన్ సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. బంగారు, డైమండ్ ఉంగరాలు, హెడ్‌ఫోన్ కనిపించకుండా పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
13
విశ్వక్సేన్ ఇంట్లో భారీ చోరీ!, ఎలా జరిగిందంటే
Theft in Actor Vishwak Sen House! IN TELUGU


 
 సినీ హీరో విశ్వక్సేన్‌ సోదరి గదిలో భారీ చోరీ జరిగింది.  ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–8లో నివసించే తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఆ కంప్లైంట్ లో బంగారు డైమండ్‌ ఉంగరాలతో పాటు ఒక హెడ్‌ఫోన్‌ కనిపించలేదు తెలియచేసారు.

23
Theft in Actor Vishwak Sen House! IN TELUGU


 వివరాల్లోకి వెళితే..రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్‌ ఉంగరాలతో పాటు ఒక హెడ్‌ఫోన్‌ కనిపించలేదు.

దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకువచ్చింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి  తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్‌ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు దొంగతన జరిగినట్లుగా గుర్తించారు. 
 

33
Theft in Actor Vishwak Sen House! IN TELUGU


సీసీ టీవి ఫుటేజ్ లో సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం నమోదైంది.  దొంగతనం కు  గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిలింనగర్‌ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు.

పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం,  దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   
 

click me!

Recommended Stories