నైట్‌ ఆ పని చేయడానికి అడ్డుగా ఉందని అమ్మమ్మకి పాలల్లో స్లీపింగ్‌ టాబ్లెట్‌.. ఫ్రెండ్స్ తో కలిసి సమంత దారుణం

First Published | Nov 18, 2024, 7:44 PM IST

ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా రాణిస్తున్న సమంత చిన్నప్పుడు ఓ చెత్త పనిచేసిందట. అర్థరాత్రి ఆ పని కోసం ఏకంగా ఫ్రెండ్‌అమ్మమ్మకి పాలల్లో స్లీపింగ్‌ టాబ్లెట్‌ ఇచ్చారట. 
 

సమంత ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రీఎంట్రీతో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఆమె నటించిన `సిటాడెల్‌` వెబ్ సిరీస్‌ విడులైంది. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలతో ఆడియెన్స్ ముందుకురాబోతుంది. ఆఫర్లని దక్కించుకునే పనిలో ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇదిలా ఉంటే సమంత వ్యక్తిగతంగా చాలా అల్లరి పిల్ల. చలాకీగా కనిపిస్తుంది. ప్రెస్‌ మీట్లలో చాలా జోవియల్‌గా ఉంటుంది.  అందరి అటెన్షన్‌ తన వైపు తిప్పుకుంటుంది. సెట్‌లోనూ అంతే అల్లరిగా ఉంటుందట. అయితే సమంత ఇప్పుడే కాదు చిన్నప్పట్నుంచే అంతే. చాలా అల్లరిగా ఉండేదట. రౌడీ బేబీ అనే ట్యాగ్‌ ఆమెకి పర్‌ ఫెక్ట్ గా సెట్‌ అవుతుంటారు. స్కూల్‌, కాలేజీ టైమ్‌లోనే గ్యాంగ్‌ని మెయింటేన్‌ చేసేదట. జూనియర్లని ర్యాగింగ్‌ కూడా చేసేదట. ఓ రకంగా చుక్కలు చూపించేదట. ఈ అమ్మడితో పెట్టుకోవాలంటే కుర్రాళ్లు కూడా భయపడేవారట. 
 


అయితే ఈ క్రమంలో ఓ కొంటె పనిచేశారు సమంత ఆమె గ్యాంగ్‌. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్‌ అమ్మమ్మకి స్లీపింగ్‌ టాబ్లెట్‌ ఇచ్చారట. ఓ రోజు రాత్రి పబ్‌ కి వెళ్లాలని, బాగా ఎంజాయ్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. వీరి గ్రూప్‌లో ఓ అమ్మాయి అప్పటికే వెళ్లింది, ఆ విషయాలు చెబుతూ వీరి ముందు బాగా బిల్డప్‌ కొడుతుందట. దీంతో ఆ జెలసీ తట్టుకోలేక తాము కూడా పబ్ కి వెళ్లాలనుకున్నారట సమంత, ఆమె ఫ్రెండ్స్. అందరు కలిసి ఓ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి చెక్కేయాలనేది వారి ప్లాన్. పేరెంట్స్ ఊరెళ్లారు. కానీ వాళ్ల అమ్మమ్మ ఉంది. 
 

ఆమె పడుకున్నాక సైలెంట్‌గా వెళ్లిపోవాలనేది వీరి ప్లాన్‌. కానీఆమె పడుకోవడం లేదట. పది దాటింది, 11 అవుతుంది. అయినా పడుకోలేదు. ఇంకా లేట్‌ అయితే వెళ్లి వేస్ట్ అని చెప్పి, సమంత ఫ్రెండ్స్ వాళ్ల బామ్మకి స్లీపింగ్‌ ట్యాబెట్లు ఇవ్వాలని ప్లాన్‌ చేశారట. పాలల్లో టాబ్లెట్‌ కలిపి ఇచ్చారు. కాసేపటికి ఆమె నిద్రపోయింది. దీంతో సైలెంట్‌గా చెక్కేశారట.

అలా ఆ రోజు బాగా ఎంజాయ్‌ చేసినట్టు తెలిపింది సమంత. లక్కీగా అమ్మమ్మకి ఏం కాలేదని, దీంతో ఊపిరిపీల్చుకున్నామని చెప్పింది. అయితే తమ జీవితంలో చేసిన చెత్త పని అదే అని, దాన్ని తలుచుకుంటే చాలా బాధగా, సిల్లీగా అనిపిస్తుందని, ఎవరూ ఇలాంటివి చేయోద్దని చెప్పింది సమంత. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఈ విషయం చెప్పారు.

South Celebrities

సమంత చివరగా `ఖుషి` సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాగానే ఆడింది. ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఇటీవలే `సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ లో మెరిసింది. ఇప్పుడు `మా ఇంటి బంగారం` అనే సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు ఒకటి రెండు చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. 

read more:తనకు డూప్‌ని పెడితే మహేష్‌ బాబు ఏం చేశాడో తెలుసా? కృష్ణతోపాటు యూనిట్ మొత్తం బిత్తరపోయిన ఘటన

also read: 80వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి
 

Latest Videos

click me!