అల వైకుంఠపురములో మూవీలోని ఇల్లు ఎవరిదో, ఎన్ని వందల కొట్లో  తెలుసా? అల్లు అర్జున్ కూడా కొనలేడు!


అల వైకుంఠపురములో మూవీలో ఉన్న విశాలమైన లగ్జరీ బంగ్లా ఎవరిదో తెలుసా? ఆ ఇల్లు చూసి అల్లు అర్జున్ చాలా ముచ్చట పడ్డాడట. అయితే దాని ధర రీత్యా ఆయన కూడా కొనలేరు.. 
 

Ala Vaikunthapurramloo house


ఒక సినిమా విజయంలో అనేక విషయాలు భాగం అవుతాయి. ముఖ్యంగా విజువల్స్ ఆడియన్స్ ని కట్టిపడేయాలి. విజువల్స్ బాగా రావాలి అంటే మంచి లొకేషన్స్ ఎంచుకోవాలి. అవి కథను, పాత్రలను ప్రతిబింబించేవి గా ఉండాలి. 
 

సినిమాల్లో కనిపించే కొన్ని ప్రదేశాలు, వస్తువులు, నిర్మాణాలు, భవంతులు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ మధ్య చాలా వరకు సెట్స్ తో లాగించేస్తున్నారు. కొందరు దర్శకులు మాత్రం అద్భుతమైన రియల్ లొకేషన్స్ ఎంచుకుంటున్నారు. అల వైకుంఠపురములో మూవీలోని ఓ బంగ్లా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ బంగ్లా వివరాలు పరిశీలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. 

2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో మూవీ ఇండస్ట్రీ హిట్. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. వరల్డ్ వైడ్ అల వైకుంఠపురములో రూ. 260 నుండి 280 కోట్ల గ్రాస్ రాబట్టింది. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 
 


ఈ మూవీ షూటింగ్ ప్రధాన భాగం ఓ లగ్జరీ బంగ్లాలో జరిగింది. హీరో తల్లిదండ్రులు పాత్రలు చేసిన టబు, జయరామ్ ధనవంతులు. వారి నివాసంగా ఆ భవనాన్ని సినిమాలో చూపించారు. ఈ ఇంట్లో ఓ సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. ఆ ఇంటిపై అల్లు అర్జున్ కూడా మోజు పడ్డారట. ఎప్పటికైనా ఇలాంటి ఓ లగ్జరీ బంగ్లా నిర్మించుకోవాలి అనుకున్నాడట.   

కాగా ఆ ఇల్లు ఎవరిది? దాని ధర ఎంత? అని పరిశీలిస్తే... ప్రముఖ మీడియా ఛానల్ ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి అల్లుడిది ఆ ఇల్లు అట. నరేంద్ర చౌదరి కూతురు పేరు రచన చౌదరి కాగా.. ఆయన భర్తకు చెందినది అట. ఆ ఇంటి మార్కెట్ విలువ రూ. 300 కోట్లకు పైమాటే అట. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఇళ్లలో అది కూడా ఒకటని సమాచారం. 
 

ala vaikunthapurramloo

మరి అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇంటి కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అల వైకుంఠపురములో మూవీ సక్సెస్ లో ఆ ఇల్లు కూడా ఒక విధంగా భాగమైంది. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. ఆమె గ్లామరస్ లుక్ ప్రేక్షకులకు ఫీస్ట్. హీరో సుశాంత్ కీలక రోల్ చేశాడు. నివేద పేతురాజ్ సైతం ఓ పాత్రలో మెరిసింది. మురళీ శర్మ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేశాడు. అల వైకుంఠపురములో చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సాంగ్ సూపర్ హిట్. 
 

అల వైకుంఠపురములో మూవీ కథ విషయానికి వస్తే... మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన హీరోకి చిన్నప్పటి నుండి కష్టాలే. దానికి తోడు  తండ్రి టార్చర్ పెడుతుంటాడు. దురదృష్టవంతుడివని ప్రతిరోజూ ఎద్దేవా చేస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ ఆఫీస్ లో చేరిన హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

మిడిల్ క్లాస్ కష్టాలు పడుతున్న హీరోకి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. తాను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాడని, తన తల్లిదండ్రులు వేరని, వారికి విలన్ వలన అపాయం ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు హీరో తన తల్లిదండ్రులను, తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు. తమను కాపాడుతున్న హీరోనే తమ సొంత కొడుకు అని హీరో పేరెంట్స్ తెలుసుకున్నారా? అసలు రిచ్ గా బ్రతకాల్సిన హీరో అష్టకష్టాలు పడటానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.. 

Latest Videos

click me!