ఒకవైపు మహేష్ బాబు అభిమానులు, మరోవైపు యావత్ సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశారు. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.