కమల్ హాసన్ తో ప్రేమ, భర్త చేతిలో మోసపోయి, ఆస్తి పేదలకు దానం చేసి.. అనాధలా మరణించిన హీరోయిన్ ..?

First Published | Oct 20, 2024, 7:35 PM IST

జీవితంలో ఎంతో అద్భుతమైన ఫిల్మ్ కెరీర్ ను చూసిన హీరోయిన్.. ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడలేకపోయింది, భర్త చేతిలో మోసపోయి.. అనాధలా మరణించిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? 
 

Kollywood Actress Srividya

వెండితెరపై వెలుగులు వెలిగిన  ఎంతో మంది హీరోయిన్స్ వెనుక విషాద గాధలు ఎన్నో.  రాజభోగాలు చేసిన వారు.. చివరకు అనాధలుగా మరణించిన వారు కూడా ఎందరో. సినిమా రంగంపై  చెరగని ముద్ర వేసి.. . అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన తారలు.. కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని నేలరాలిన సందర్బాలు మరెన్నో అలాంటివారిలో శ్రీదివ్వ కూడా ఒకరు. 

Also Read: సమంత తో నటించొద్దు.. బాలీవుడ్ హీరోను హెచ్చరించింది ఎవరు..?

Srividya

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ తార.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వస్తే సెలబ్రెటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలిన ఈ హీరోయిన్.

అంతులేని కన్నీటి అగాథంలో చిక్కుకుని ఎలా విలవిలలాడిందో తెలిస్తే.. కన్నీళ్ళు పెట్టక మానరు. ప్రియుడి కోసం మతాన్ని మార్చుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ ప్రేమకే ఆమె బలైంది శ్రీదివ్య. సినిమా జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి..  రియల్ లైఫ్ లో మాత్రం డిజాస్టర్ అయ్యింది శ్రీదివ్య.

అందాల రాశిగా వెండితెరపై సందడి చేసిన ఆ హీరోయిన్ తన మరణానికి ముందు కోట్లాది ఆస్తిని పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చింది. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదు అంటూ ఆలోచించింది. ఆచరణలో పెట్టి తిరిగిరాని లోకాలకు పయనం అయ్యింది. 

Also Read: ఒక్క రాత్రికే 70,000 ఖర్చుపెట్టిన పూజా హెగ్డే


Srividya

ప్రముఖ దక్షణాది హాస్యనటుడు కృష్ణమూర్తి, గాయని ML వసంత కుమారిల పెద్ద కుమార్తె శ్రీవిద్య . తను పుట్టిన ఏడాదికే తండ్రి మంచాన పడ్డాడు. ఆమె తండ్రి కృష్ణమూర్తి యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ శ్రీవిద్య తల్లి వసంతకుమారి చూసుకోవాల్సి వచ్చింది.

దాంతో  శ్రీవిద్య 14 ఏళ్ల వయసులోనే సంపాదన కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక తప్పలేదు. శివాజీ గణేశన్ తో కలిసి  తిరువరుట్‌చెల్వన్‌ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ విద్య... పేదరాశి పెద్దమ్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

హీరోయిన్ గా ఎంతో ఆకట్టుకుంది శ్రీవిద్య. అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటి సీనియర్ నటులతో వరుస సినిమాలు చేసింది శ్రీవిద్య. మరీముఖ్యంగా కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు నటించింది. ఆతరువాత రజినీకాంత్ సినిమాల్లో మెరిసింది. తెలుగులో ఆమెను ఎక్కువగా దాసరి నారాయణరావు  ప్రోత్సహించేవారు. 

Also Read: పవన్ కళ్యాణ్ ‌- దీపిక పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా

srividya

కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకాంత్, కమల్ హాసన్ తో కలిసి నటించింది. కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేసేసరికి వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారట.

అయితే శ్రీవిద్య తల్లి ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో.. వీరి ప్రేమ పెళ్ళి పీఠలదాక రాలేదు. అదే సమయంలో  శ్రీవిద్య 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ని పెళ్లాడింది. అయితే వైవాహిక జీవితం ఈమెకు నరకంగానే మారిందని చెప్పాలి. పెళ్ళి తరువాత భర్త చెప్పడంతో సినిమాలు మానేయాల్సి వచ్చింది శ్రీవిద్య.

ఆమె ఆస్తి మొత్తం కూడా భర్త దక్కించుకన్నాడు. ఆతరువాత నుంచి ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు. ఇక  మనస్పర్థలు పెరగడంతో వీరు  1980లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత శ్రీవిద్యకు ఆర్థిక సమస్యలు ప్రారంభం కావడంతో మరోసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్టార్ నటి. 

Also Read: త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

సినీ పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీవిద్య.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన జీవితం స్ట్రార్ట్ చేసింది.  తమిళం, తెలుగు, మలయాళ సినిమాల్లో వరుసగా క్యారెక్టర్ రోల్స్  చేసింది. ఇక జీవితం సాఫీగా సాగుతుంది అనుకున్న టైమ్ లో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. క్యాన్సర్ బారిన పడింది. 2003లో శ్రీవిద్య అనారోగ్య సమస్యల కారణంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read:బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాను ఎలాగు మరణిస్తున్నానన్న సంగతి తెలిసి.. తన ఆస్తి నలుగురికి ఉపయోగపడాలి అనుకుంది. దాంతో సంగీత, నృత్య కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు తన ఆస్తి మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్టార్ నటీనటులతో విరాళాలు సేకరించి పేద విద్యార్థులకు అందించింది.

2006లో 53 ఏళ్ల వయసులో శ్రీవిద్య అనారోగ్యం కారణంగా  మరణించింది. ఒక అద్భుతమైన నటి జీవితం.. భర్త కారణంగా.. అనారోగ్యం కారనంగా చివరకు ఇలా అనాధలా ముగిసింది. కమల్ హాసన్ ను పెళ్లాడి ఉంటే.. ఎలా ఉండేదో. 

Latest Videos

click me!