నేను బరువు తగ్గాక యమదొంగ షూటింగ్ సమయంలో, కమెడియన్ అలీ ముందుకు వెళ్లి ఇప్పుడెలా ఉన్నాను అన్నాను. ఆయన నా మీద కౌంటర్ వేశాడు. గతంలో హరికృష్ణ నాన్నలా ఉన్నావు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులా ఉన్నావు, అన్నాడు. అంటే గతంలో నేను అంత ఛండాలంగా ఉన్నానా? అంటే అంత పెద్ద వయసున్న వాడిగా కనిపించానా? అని అడిగాను. ఏమోలే.. హరికృష్ణ తండ్రిలా ఉన్నావని అనడం ద్వారా, తాత ఎన్టీఆర్ లా ఉన్నానని... అలీ అనుకోకుండా పోల్చాడని.. నేను సంతోష పడ్డానని, ఎన్టీఆర్ అన్నారు.
ఇక ఎన్టీఆర్ బరువు తగ్గడానికి రాజమౌళి కారణం అయ్యాడు. ఎన్టీఆర్ కి రాజమౌళి జ్ఞానోపదేశం చేశాడట. అసలు నీకు అర్థం అవుతుందా.. ఒక వర్గం ప్రేక్షకులు నీ సినిమాలు చూడటం లేదు. యూత్, అమ్మాయిలు ఇలా ఉంటే ఎలా ఇష్టపడతారు. నువ్వు బరువు తగ్గాలని రాజమౌళి అన్నారట. అప్పుడు ఎన్టీఆర్ లైపోసక్షన్ చేయించుకున్నాడట. బరువు తగ్గాక చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడట ఎన్టీఆర్.