బాలు గాత్రం.. కీరవాణి మ్యూజిక్..
ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటే, ఆ గొంతులో ఉండే వణుకు, ఆ ఆవేదన వింటుంటే మనకు తెలియకుండానే కళ్లు చెమర్చుతాయి. ఎం.ఎం. కీరవాణి గారు కూర్చిన ఆ విషాద భరితమైన ట్యూన్, ఈ పాటను తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఎమోషనల్ క్లాసికల్ గా నిలపెట్టింది.
సినిమాకు హైలెట్ క్లైమాక్స్...
ఈ పాట సినిమా క్లైమాక్స్ లో వస్తుంది. తల్లి తన బిడ్డలను దత్తత ఇచ్చేసిన తర్వాత అందరినీ చివరిసారిగా కలుస్తున్న సమయంలో వచ్చే పాట ఇది. థియేటర్ లో ఈ పాట చూసి ఏడ్వని వారు ఎవరూ ఉండరు.
ఈ రాలిపోయే పువ్వా పాట కేవలం సినిమా పాట కాదు... అది మాతృత్వానికీ ఒక నివాళి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, ఆ అమ్మ దూరం అవుతుంటే కలిగే బాధ ఎలా ఉంటుందో ఈ పాట నిరూపించింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడ వినిపించినా? టీవీలో చూసినా.. కచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరగాల్సిందే.