శర్వానంద్, రాజశేఖర్ కలిసి నటించిన `బైకర్` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది. హిట్ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలంటే?
శర్వానంద్ ఈ శుక్రవారం `బైకర్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అభిలాష్ రెడ్ది దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. తెలుగులో బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. పైగా రాజశేఖర్ కీలక పాత్రలో నటించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే శర్వానంద్ చివరి మూవీ `నారీ నారీ నడుమ మురారి` మూవీ పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఈ మూవీపై ఆ బజ్ ఉంది.
25
బైకర్ మూవీకి నెగటివ్ టాక్
శుక్రవారం(ఏప్రిల్ 3)న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మాత్రం ఆడియెన్స్ ని అలరించడంలో విఫలమయ్యింది. చాలా వరకు నెగటివ్ టాక్ వచ్చింది. అయితే సినిమా బాగుందని టీమ్ వెల్లడించింది. నెగటివ్ రివ్యూలపై కూడా విరుచుకుపడ్డారు. కానీ ఆడియెన్స్ నుంచి మాత్రం పెద్దగా ఆదరణ లేదు. ఈ మూవీకి కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. శర్వానంద్ గత చిత్రం `నారీ నారీ నడుమ మురారి`తో పోల్చితే చాలా తక్కువగా కలెక్షన్లు ఉన్నాయి. సగానికిపైగా తక్కువగా ఉండటం గమనార్హం.
35
బైకర్ మూవీ మూడు రోజుల కలెక్షన్లు
`బైకర్` మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత రావాలనేది చూస్తే. ఈ చిత్రం మూడో రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.7.30కోట్ల నెట్ కలెక్షన్లని రాబట్టింది. మొదటి రోజు రూ.2.80కోట్లు, రెండో రోజు రూ.2.33కోట్లు, మూడో రోజు రూ.2.14కోట్లు వసూలు చేసింది. ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.8.51 కోట్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడు రోజుల్లో రూ.9.71కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు ఐదు కోట్ల షేర్ సాధించింది.
`బైకర్` మూవీకి థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.20కోట్లు అని సమాచారం. ఈ మూవీ హిట్ కావాలంటే రూ.21కోట్ల షేర్ రావాలి. అంటే సుమారు రూ.40కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు పది కోట్ల వరకు సాధించింది. ఇంకా ముప్పై కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. సోమవారం బుకింగ్స్ చూస్తే చాలా డల్‌గా ఉంది. కోటీ కూడా లేదు. అంటే సగానికి సగం పడిపోయింది. సోమవారం కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్ ఆధారపడి ఉంది. మరి ఇది ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
55
బైకర్ మూవీ కథ ఇదే
`బైకర్` మూవీ కథేంటనేది చూస్తే, ఇందులో శర్వానంద్ బైకర్ రేసర్. వాళ్ల నాన్న రాజశేఖర్. ఆయన ఒకప్పుడు ఇండియాకి బైక్ రేసింగ్ అంటే చూపించారు. దానికంటూ ఒక గుర్తింపుని తీసుకొస్తారు. దీంతో తన కొడుకుని ఛాంపియన్‌గా చూడాలనుకుంటాడు. స్థానికంగా అన్నింటిలోనూ గెలిచిన శర్వానంద్ ఫైనల్స్ కి ముందు రేస్ నుంచి తప్పుకుంటాడు. దీంతో రాజశేఖర్ పరువు పోతుంది. ఇద్దరు దూరమవుతారు. మరి శర్వానంద్ ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకుంటాడు? అసలు ఏం జరిగింది? మళ్లీ ఎందుకు కమ్‌బ్యాక్ అయ్యాడనేది కథ. ఇందులో మాళవిక శర్వానంద్ కి లవర్‌గా, భార్యగా కనిపించింది.