హైదరాబాద్ లో టబు ఆస్తులు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు, అన్ని కోట్లు ఎలా వచ్చాయో తెలుసా..?

First Published | Oct 25, 2024, 6:55 PM IST

బాలీవుడ్ లో టబు ఎంత పెద్ద హీరోయిన్ అందరికి తెలిసిందే. అయితే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఆమెకు.. హైదరాబాద్ లో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..? 

Tabu

బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా  వెలుగు వెలిగి.. స్టార్ హీరోల సరసన  జోడి కట్టిన ఓ ఫేమస్ నటి.. ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అప్పటిలాగానే  రొమాంటిక్ సినిమాలు చేస్తూ...  ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే అన్నట్లుగా జోరు చూపిస్తోంది టబు. 

Also Read:  సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

అసలు హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ.. కాని హాఫ్ సెంచరీ దాటిన తరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో టబు కూడా ఒకరు.  గతంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ టబు.. ఇప్పుడు కూడా హీరోయిన్‌గానే నటిస్తొంది.  గ్లామర్‌ పాత్రలు సాధిస్తూ.. అదరగొడుతోంది. 

తన బ్యూటీ ఇంకా తగ్గలేదంటోంది. ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టింది.. 51 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను కొల్లగొడుతుంది టబు. దానికి తోడు ఆమె చేస్తున్న గ్లామర్ పాత్రలకు ఫిదా అయిపోతున్నారు జనాలు. ఇప్పటికీ ఆమె  అందాన్ని ఆరాధించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు.

Also Read: ఐశ్వర్య రాయ్ కి జిరాక్స్ కాపీలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?


బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్‌ తెచ్చుకోవడంతో పాటు... ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో  4 దశాబ్దాలుగా యాక్టీవ్ గా ఉంది ఈ బ్యూటీ. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో టబుది ప్రత్యేక స్థానం.  బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈమె ఒకప్పుడు హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జునతో ఈమె నటించిన నిన్నే పెళ్ళాడుతా, సిసింద్రీ వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. 

Also Read: ఎన్టీఆర్ వల్లే నష్టపోయాం.. కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈటీవి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

Tabu

తెలుగు పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో సినిమాలు చేసింది టబు. ఈమధ్య కాలంలోనే ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. అది కూడా పవర్ ఫుల్ రోల్.. సినిమా కథను మలుపుతిప్పేవి మాత్రమే ఎంచుకుంటుంది. కాగా టబుకు  హైదరాబాద్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ట‌బు చైల్డ్ వుడ్ తో పాటు.. ఆమె చదువు కూడా హైదరాబాద్ లోనే సాగింది. హైదరాబాద్  మైనంపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ తాతలతో కలిసి చాలా ఏళ్లు ఉంది టబు. 

Also Read: 1200కు గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసిన సూర్య.. స్టార్ హీరో ఎలా అయ్యాడు..?

అంతే కాదు ఇక్కడి సెయింట్ ఆన్స్ హై స్కూల్ లోనే టబు చదువుకున్నారు. అందుకే ఎప్పుడూ తాను  హైదరాబాద్ అమ్మాయిని అంటుంటుంది. ఆతరువాతే బాలీవుడ్ హీరోయిన్ ను అని చెప్పేది. ఇక  తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెకు ఉన్న ఆస్తుల గురించి రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల గురించి  వివరించింది. 

హైదరాబాదులో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ , బంగ్లాతో పాటు మరిన్ని ఆస్తులు ఉన్నాయట. అయితే అవన్నీ తన మేనత్త ఆస్తులని. ఆమెద్వారానే తనకు వచ్చాయని టబు ఇంటర్వ్యూలో వెల్లడించారు.  అలాగే రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడుతూ వాటిలో ఆమె పెట్టిన పెట్టుబడి గురించి కూడా చెప్పుకొచ్చింది ట‌బు.

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

వివిధ ప్రాపర్టీల నుండి రెంట్ తీసుకోవడం వాటిని మేనేజ్ చేయడం వంటివి చేస్తుంటుందట టబు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో టబుకు లగ్జరీ బంగ్లా కూడా ఉందట. దానిని 2000 సంవత్సరంలో ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఇలా హైదరాబాద్ లో చాలా ఆస్తులు కూడబెట్టింది టబు. 

ఇక ఆమె సినిమాల వియానికి వస్తే.. తెలుగులో అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించిన టబు.. హిందీలో ఈ మధ్యనే క్రూ అనే సినిమాలో కనిపించారు. త్వరలో ఆమె డ్యూన్ ప్రొఫెసీ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రీక్వల్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆమె సిస్టర్ ఫ్రాన్సెస్ పాత్రలో కనిపించబోతున్నారు. 

Latest Videos

click me!