రాజా సాబ్ గేమ్ ఓవర్.. 13వ రోజు ప్రభాస్ సినిమా షాకింగ్ వసూళ్లు

Published : Jan 22, 2026, 04:01 PM IST

ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా రిలీజ్‌కు ముందు ఎంత హడావిడి చేసిందో, రిలీజ్ తర్వాత అంతగా నిరాశపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఈ క్రమంలో సినిమా 13వ రోజు  రాజా సాబ్  కలెక్షన్ల వివరాలు చూస్తు..?

PREV
16
అభిమానులను నిరాశపరిచిన రాజాసాబ్

పాన్ ఇండియా  స్టార్ హీరో  ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్'. ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. రాజాసాబ్ కు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. సినిమా నెమ్మదిగా 13 రోజులు థియేటర్లలో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 13వ రోజు కలెక్షన్ల వివరాలు ఏంటంటే? 

26
13వ రోజు రాజాసాబ్ కలెక్షన్లు..

sacnilk.com రిపోర్ట్ ప్రకారం, 'ది రాజా సాబ్' సినిమా 13వ రోజున రూ. 48 లక్షలు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద సినిమా ఆట ముగిసినట్టే కనిపిస్తోంది. మరోవైపు,   సన్నీ డియోల్ 'బోర్డర్ 2' రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ సినిమా బాలీవడ్ లో నిలదొక్కుకోవడం మరింత కష్టమవుతుంది.

36
ది రాజా సాబ్ మొదటి రోజు

‘ది రాజా సాబ్’ మొదటి రోజు రూ. 62.9 కోట్లు వసూలు చేసింది. తర్వాత వసూళ్లు తగ్గాయి. మొదటి వారాంతంలో ఈసినిమా రూ. 130.25 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో రూ. 141.98 కోట్లు సంపాదించింది ప్రభాస్ మూవీ.

46
ప్రభాస్ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్

‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్ రూ. 201 కోట్లు. జనవరి 21న తెలుగు ఆక్యుపెన్సీ 14.29%గా ఉంది. ఉదయం షోలకు 15.02%, మధ్యాహ్నం 12.81%, సాయంత్రం 14.63%, రాత్రి 14.7% ఆక్యుపెన్సీ నమోదైంది.

56
ది రాజాసాబ్ బడ్జెట్ వివరాలు

‘ది రాజా సాబ్’ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీశారు. కానీ 13 రోజులైనా రూ. 150 కోట్ల మార్కును దాటలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. లక్షలు వసూలు చేయడం కూడా కష్టంగా మారింది. ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో ఎంతో నిరాశతో ఉన్నారు. 

66
ఫాంటసీ హారర్ కామెడీ సినిమా

‘ది రాజా సాబ్’ ఒక ఫాంటసీ హారర్ కామెడీ సినిమా. మారుతి దర్శకత్వం వహించిన ఈసినిమాలో . ప్రభాస్‌ జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్  నటించారు. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories