Pawan Kalyan : అదే ఉత్సాహం.. అదే తపన.. చిరంజీవి సినిమాపై పవన్ కళ్యాణ్ రివ్యూ, టీమ్ కు శుభాకాంక్షలు

Published : Jan 22, 2026, 03:34 PM IST

మెగా బ్లాక్‌బస్టర్‌ మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీమ్ కు పవర్ స్టార్ నుంచి ప్రత్యేక అభినందనలు అందాయి. పవన్ తరపున ఆయన నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ నోట్ లో ఏముందంటే? 

PREV
15
45 ఏళ్ల సినీ ప్రయాణంలో

దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఎన్నో అవాంతరాలు దాటుకుని టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగాడు.ఇక 70 ఏళ్ల వయసులో.. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు చిరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి సందడి చేశారు.

25
అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా

మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా అనిల్ రావిపూడి ఈసినిమాను మలిచారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈసినిమా.. మెగాస్టార్ మూవీ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమాకు సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకూ ఎంతో మంది నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపున.. ఆయనకు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, 'మన శంకర వరప్రసాద్ గారు టీమ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.

35
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కామెంట్స్..

"మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, మన శంకర వరప్రసాద్ గారు సినిమా యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా ఉంటూ.. ఈ ఏజ్ లో కూడా అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారు. ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని అందించిన ఆయన ప్రతిభ ప్రశంసనీయమైనది.'' అని రాశారు.

45
మన శంకర వరప్రసాద్ గారు టీమ్ కు శుభాకాంక్షలు..

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కామెంట్స్ లో ఇంకా ఏముందంటే? ''మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే తెరపై కలిసి కనిపించడం ప్రేక్షకులకు నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన అద్భుతమైన సంగీతం, సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యే సినిమాను అందించిన నిర్మాతలు సాహు గారపాటి గారు, సుష్మితకి కూడా ప్రత్యేక అభినందనలు. ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైన నయనతార గారు, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు మూవీ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు." అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.

55
బాక్సాఫీస్ దగ్గర మన శంకర వరప్రసాద్ గారు రచ్చ..

మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ప్రేక్షకుల ఆదరణతో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి సెలవులు అయిపోయిన తరువాత కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. అటు అనిల్ రావిపూడికి కూడా ఈ సినిమాతో డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగాపెంచినట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories