ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రానికి బాక్సాఫీస్ కష్టాలు తప్పడం లేదు. కానీ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన ఒక క్రేజీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం అన్నింటికంటే ముందుగా సంక్రాంతి సందడి మొదలు పెట్టింది. మారుతి దర్శకత్వంలో 300 కోట్లకి పైగా బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ కష్టాలు తప్పడం లేదు. తొలి షో నుంచే రాజాసాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు.
25
రాజాసాబ్ కలెక్షన్స్ లో డ్రాప్
మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. మాళవిక మోహనన్ కి ఇదే తొలి తెలుగు చిత్రం. దీనితో ఆమె ఈ మూవీఫై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రాజాసాబ్ రిజల్ట్ మాత్రం ఆశాజనకంగా లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఆదివారం నుంచి కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రిలీజ్ అయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కూడా మంగళవారం రిలీజ్ అవుతోంది. రాజాసాబ్ చిత్రం 210 కోట్ల షేర్ టార్గెట్ తో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 99 కోట్లు మాత్రమే వచ్చాయి.
35
మాళవిక మోహనన్ పోస్ట్ వైరల్
ఈ నేపథ్యంలో రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ టైంలో మాళవిక మోహనన్ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. రాజాసాబ్ సినిమా చూసిన వారంతా తన పొగుడుతున్నారు అంటూ చెప్పకనే చెప్పింది. కొందరు అభిమానులు రాజాసాబ్ చిత్రంలో ఆమె అప్పియరెన్స్, గ్లామర్ ని మెచ్చుకుంటూ రీల్స్ చేస్తున్నారు. వాటిలో ఒకదానిని మాళవిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియో నాకు చాలా క్యూట్ గా అనిపించింది.. అందుకే షేర్ చేస్తున్నా అని పేర్కొంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అల్లు అర్జున్ డైలాగ్ ఉంది. అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ హీరోయిన్ ని ఉద్దేశించి చెప్పిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' డైలాగ్ బాగా ఫేమస్ అయింది.
55
అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం
అందులో పూజా హెగ్డేకి బదులుగా అభిమానులు మాళవిక ఫోటోస్ పెట్టారు. మాళవిక రాజాసాబ్ చిత్రంలో ఎంత అందంగా కనిపించిందో చెప్పేలా ఈ వీడియో ఉంది. ఒక వైపు రాజా సాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంటే మాళవిక తన పబ్లిసిటీ పనిలో ఉండిపోయింది అని, అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.