Suma Kanakala : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ

Published : Jan 13, 2026, 09:00 AM IST

Suma Kanakala : ఈ మధ్య స్టార్ యాంకర్ సుమ కామెడీగా మాట్లాడుతూ.. కాస్త నోరు జారుతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ లో కూడా ఏదో ఒక కామెంట్ చేసి.. విమర్శలకుగురవుతున్నారు. ఆమధ్య ఓ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ పై సుమ వేసిన జోక్ విమర్శలకు కారణం అయ్యింది. 

PREV
14
మోస్ట్ వాంటెడ్ యాంకర్ సమ కనకాల..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుమ కనకాల మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది. 50 ఏళ్ల వయసులో కూడా సుమ..యంగ్ యాంకర్స్ కు పోటీ ఇస్తూ.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. టాలీవుడ్ లో స్టార్ ఈవెంట్లు ఏమైనా ఆమె దగ్గరకు వెళ్లాల్సిందే. స్టార్ హీరోల ప్రీరిలీజ్ ఈవెంట్లలో సుమ ఉండాల్సిందే. కొన్ని చిన్న చిన్న ఈవెంట్లు సుమ చేసిందంటే.. అక్కడ చీఫ్ గెస్ట్ కంటే కూడా సుమకే ఎక్కువ మర్యాదలు జరుగుతుంటాయి. యాంకర్లలో కూడా స్టార్స్ ఉంటారని నిరూపించింది సుమ కనకాల.

24
అప్పుడప్పుడు నోరు జారుతున్న సుమ ..

ఏ ఈవెంట్ అయినా.. తడబడకుండా..సమయస్పూర్తితో సక్సెస్ చేస్తుంటుంది సుమ. అయితే మధ్య మధ్యలో జోకులు వేస్తూ.. అందరిని నవ్వించడం సుమ కనకాలకు అలవాటు. ఈక్రమంలోనే ఆమె జోకులు అప్పుడప్పుడు తడబడుతున్నాయి. విమర్శలకు కారణం అవుతున్నాయి. ఆమధ్య ఓ ఈవెంట్ లో మీడియా వాళ్లు స్కాక్స్ ఎక్కువగా తింటున్నారని కామెంట్ చేసి..విమర్శల పాలు అయిన సుమ.. అంతకు ముందు కూడా కొన్ని ఈవెంట్ లో కాస్త వింత కామెంట్స్ చేసి... విమర్శలు ఫేస్ చేసింది. ఇక తాజాగా సుమ మరోసారి నోరుజారిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

34
డైరెక్టర్ పై సుమ కామెంట్స్..

ఆమధ్య ఓ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ ఈవెంట్ ను సుమ కనకాల హోస్ట్ చేసింది. అప్పుడు అక్కడ ఉన్న జాతిరత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. '' నేను ఎక్కవ టైమ్ తీసుకోను.. అందరికి నమస్కారం.. చిరంజీవిగారు వచ్చినందకు సంతోషంగా ఉంది. మీ కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. మీరు ఇంకా ఇలాంటి సినమాలు చేస్తే చూడాలని ఉంది '' అని ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడాడు. 

దాంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. చిరంజీవి కూడా అయిపోయిందా అని నవ్వుతూ అనదీప్ ను అడిగారు. ఈలోపు సుమ అందుకుని.. '' అయిపోయిందా మొత్తం.. ఇంత ఫాస్ట్ గా.. రోడ్డు మీద బుక్స్ అమ్ముకుంటారు కదా.. సార్ సార్ బుక్స్ సార్.. తీసుకోండి సార్.. అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడావు అని కామెంట్ చేసింది. దాంతో సుమ కామెంట్స్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అనుదీప్ తో ఉన్న చనువు వల్లే సుమ అలా అనగలిగిందని.. అందులో తప్పేముందని మరికొందరు అంటున్నారు. 

44
బుల్లితెర సంచలనం..

టెలివిజన్ ప్రపంచంలో.. యాంకర్ సుమ ఒక సంచలనం, దాదాపు 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ... 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకుపోతోంది. 50 ఏళ్లు దాటినా.. అదే ఉత్సాహంతో, అదే జోష్ తో కొనసాగుతోంది సుమ. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగువారి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యురాలిలా మారిపోయిన సుమ, తన స్పస్టమైన తెలుుగు, మాట తీరు, కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడూ అలరిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూనే ఉన్నా, ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తోంది సుమ కనకాల.

Read more Photos on
click me!

Recommended Stories