Srishti: బిగ్ బాస్ నుంచి సృష్టి ఎలిమినేట్.. హౌస్ లో ముసుగు వేసుకున్నది ఆ ఇద్దరే, అంటించి వెళ్లడం అలవాటు

Published : Oct 04, 2026, 11:07 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం రోజు సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తుల గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో 28వ రోజు అంతా ఊహించిన ఎలిమినేషన్ జరిగింది. సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయింది. ఆదివారం కాబట్టి ఎలిమినేషన్ తో పాటు హౌస్ లో కొన్ని ఫన్ టాస్క్ లని కూడా నాగార్జున చేయించారు. మధ్యలో నాగార్జున నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి నామినేషన్స్ లో సృష్టి, షాలిని మిగిలిచారు.

24
ఎవరిని ముంచుతారు ?

అంతా ఊహించినట్లుగా సృష్టి ఎలిమినేట్ అయింది. అంతకు ముందు హౌస్ లో ఇంటి సభ్యులని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపుకి ఒక్కో కెప్టెన్ ని నియమించారు. ఆ గ్రూప్ ని పిలిచి ఓడ లాంటి సెట్ లో నిల్చోమన్నారు. ఒక వేల ఓడ మునిగిపోయే పరిస్థితుల్లో ఒకరిని సేవ్ చేసి.. మరొకరిని ముంచేయాలి అంటే ఎవరిని ముంచుతారు అనేది కెప్టెన్ చెప్పాలి.

34
రోహిత్ తో జీవితాంతం, హింట్ ఇచ్చిన షాలిని

నరేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ ఒక టీమ్ గా వెళ్లారు. వీళ్ళకి కెప్టెన్ నరేష్. ఎవరిని ముంచుతావ్ అని నరేష్ ని అడగా.. రామ్ ప్రసాద్ పేరు చెప్పారు. రాంప్రసాద్ ఇటీవల కొంచెం ఎక్కువగా తొందర పడుతున్నారు. గేమ్ ని మధ్యలోనే వదిలేస్తున్నారు అని నరేష్ తెలిపారు. ఝాన్సీ, షాలిని, రోహిత్ ఓకే టీం గా వచ్చారు. ఆ టీంకి షాలిని లీడర్. ఎవరిని ముంచుతావు అని అడిగితే ఆమె వెంటనే ఝాన్సీని ముంచుతాను అని తెలిపింది. కారణం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రోహిత్ తో జీవితాంతం తోడుగా ఉండాలి అనుకుంటున్నా అని తన ఉద్దేశాన్ని, రోహిత్ పై ప్రేమని చెప్పకనే చెప్పేసింది.

44
ఆ ఇద్దరూ ముసుగు వేసుకున్నారు

ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. సృష్టి ఎలిమినేట్ అయింది అని నాగార్జున ప్రకటించగానే షాలిని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంటిసభ్యులంతా ఆమెకి వీడ్కోలు చెప్పారు. స్టేజీపైకి వెళ్లిన సృష్టి బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీని గుర్తు చేసుకుంది. హౌస్ లో ఇంకా మాస్క్ వేసుకుని ఉన్న వాళ్ళు ఎవరు అని అడుగగా.. ముకేశ్, రామ్ ప్రసాద్ అని సృష్టి సమాధానం ఇచ్చింది. ముకేశ్ ఎలాంటి గేమ్ ఆడినా ఎవ్వరికీ తెలియని స్టాటజీ ఫాలో అవుతాడు అని పేర్కొంది. రామ్ ప్రసాద్ అగ్గిపుల్ల అంటించి సైలెంట్ గా వెళ్ళిపోతారు అని పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories