విలాసవంతమైన భవనాలు, స్థలాలు... కోహ్లీ, అనుష్క శర్మల ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

First Published Feb 1, 2021, 2:42 PM IST

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మోస్ట్ పాప్యులర్ స్టార్ కపుల్ గా ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా అనుష్క, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ తమ తమ రంగాలలో దూసుకుపోతున్నారు. ఇటీవలే అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మను ఇవ్వగా... తల్లిదండ్రులుగా మారారు. మరి ఈ క్రేజీ కపుల్ ఆస్థుల వివరాలు తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. 
 

2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం అత్యధిక ఆదాయం కలిగిన 100మంది సెలెబ్రిటీల జాబితాలో కోహ్లీ అగ్రస్థానం అందుకున్నారు. 252.72 కోట్ల వార్షిక సంపాదనతో ఆయన సల్మాన్ ని కూడా వెనక్కునెట్టి మొదటి ప్లేస్ దక్కించుకున్నాడు.  అదే ఏడాది చివర్లో కోహ్లీ నికర ఆస్థి రూ. 900 కోట్లు అని జి క్యూ మ్యాగజైన్ ప్రచురించింది.
undefined
ఇక 2020 ఐపీఎల్ కి గాను అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రూ. 18కోట్లతో కోహ్లీ, ముందు వరుసలో నిలిచాడు. రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు ఈ మొత్తం చెల్లించి కోహ్లీని తమ టీం కోసం పాడుకోవడం జరిగింది. ఇక బీసీసీఐ నుండి వార్షిక చెల్లింపుల రూపంలో ఆయనకు రూ. 7 కోట్లు దక్కుతున్నాయి.
undefined
వీటితో పాటు విరాట్ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. అలాగే విరాట్ కోహ్లీకి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవ్వన్నీ కలుపుకుంటే విరాట్ సంపద రూ. 1000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
undefined
ఇక అనుష్క శర్మ 2019లో రూ. 28.67  కోట్ల ఆదాయం పొందినట్లు ఫోర్బ్స్ తెలియజేసింది .  2018లో 45.83 కోట్ల సంపాదన కలిగిన కలిగిన అనుష్క, తదుపరి సంవత్సరం సగానికి పడిపోయారు. అయినప్పటికీ అనుష్క వ్యక్తిగత సంపద విలువ రూ. 350కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
undefined
అనుష్క హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ ఆ మధ్య కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. అలాగే కొన్ని వ్యాపార ప్రకటన ద్వారా అనుష్క భారీగా సంపాదిస్తున్నారు.
undefined
ఇక ఇద్దరికీ ఉమ్మడిగా 7171 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దాని విలువ రూ. 34 కోట్లట. వీరికి గుర్గావ్ లో రూ. 80కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉందట. ఆలా మొత్తం కలుపుకుంటే అనుష్క, విరాట్ ఆస్థి విలువ రూ. 1200 కోట్లని తెలుస్తుంది.
undefined
click me!