తాగిన మత్తులో సమంతపై వర్మ ట్వీట్.. చైతూ రియాక్షన్ తో డిలీట్!

First Published Feb 1, 2021, 12:16 PM IST

పక్కనోళ్ళ జీవితాలతో పేకాడుకోవడం అంటే దర్శకుడు వర్మకు ఎక్కడలేని సరదా. తన సినిమాలకు మూలధనంగా వివాదాలను వాడుకుంటూ, చక్కగా క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. కిక్కులో ఉంటే ఏ ఒక్కరినీ వదలని వర్మ, ఓ సంధర్భంలో సమంతపై ఓ క్రేజీ ట్వీట్ చేశాడు. 
 

దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ 2019 సమ్మర్ కానుకగా విడుదల కావడం జరిగింది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ సమంతను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
undefined
'ఈ ట్వీట్ చేయడానికి ముందు నేను నాలుగు పెగ్గులు వోడ్కా వేసి ఉన్నా, అయితే తాకగపోతే నేను ఇంకా వరస్ట్ గా ఉంటా. మజిలీ ట్రైలర్ లో సమంత కంటే కూడా నాకు చైతూ నువ్వే నచ్చావ్. అలా అని నేను గే  కాదు. సమంత అంటే నాకు ఎంతో ప్రేమ... అయినప్పటికీ ఈ నిజం చెప్పక తప్పలేదు'  అని వర్మ ట్వీట్ చేయడం జరిగింది.  మజిలీ ట్రైలర్ లో సమంతను గ్లామర్ పరంగా చైతూ డామినేట్ చేశాడని పరోక్షంగా ఆయన ట్వీట్ చేశాడు.
undefined
వర్మ ట్వీట్ కి చైతన్య రియాక్ట్ కావడం జరిగింది.  వర్మకు సమాధానంగా ' అలాగే వర్మ, ఏది ఏమైనా మనమందరం మంచి సినిమా చూడబోతున్నాం.. చీర్స్' అంటూ ట్వీట్ చేశాడు.
undefined
మత్తు దిగాక వర్మ తన ట్వీట్ ని డిలీట్ చేయడం విశేషం. చైతు మీద ఉన్న అభిమానంతో వర్మ తనదైన శైలిలో మూవీకి ప్రచారం తెచ్చారని అనిపిస్తుంది.
undefined
మజిలీ చైతూ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలవడంతో పాటు హిట్ టాక్ సొంతం చేసుకుంది. మజిలీ మూవీలో సమంత నటనకు విమర్శకుల ప్రశంశలు దక్కాయి.
undefined
click me!