హాస్యానికి 65వసంతాలు...  బ్రహ్మానందం బర్త్ డే పిక్స్!

First Published Feb 1, 2021, 12:54 PM IST


హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో గల చాగంటివారిపాలెంలో బ్రహ్మానందం జన్మించారు. వెయ్యికి పైగా సినిమాలో నటించిన బ్రహ్మానందం పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. 

అలాగే అత్యధిక చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు.
undefined
1987లో మొదలైన బ్రహ్మానందం  నటప్రస్థానం దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతుంది. బ్రహ్మానందం ఉంటే చాలు సినిమాకు వెళ్లొచ్చన్న బ్రాండ్ ఇమేజ్ ఆయన తెచ్చుకున్నారు
undefined
స్టార్ హీరోల సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సెపరేట్ గా ఉండాల్సిందే. ఆయన కామెడీ సినిమా విజయంలో భాగమైన సందర్భాలు కోకొల్లలు. ఎన్టీఆర్ అదుర్స్, మహేష్ దూకుడు చిత్రాల విజయాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.
undefined
ఆ మధ్య అనారోగ్యం పాలైన బ్రహ్మానందం  సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం బ్రహ్మానందం సెలెక్టెడ్ గా చిత్రాలు చేస్తున్నారు.
undefined
మూడు దశాబ్దాల పాటు రెండు తరాల స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బ్రహ్మానందం చాలా బిజీ లైఫ్ అనుభవించారు. ఏడాదిలో లెక్కకు మించిన సినిమాలలో ఆయన నటించడం జరిగింది.
undefined
ఆరోగ్య కారణాల రీత్యా ఇంటిలో ఖాళీగా ఉన్న బ్రహ్మానందం తనలోని మరో కళను వెలికి తీశారు.
undefined
గొప్ప చిత్రకారుడైన బ్రహ్మానందం రామాంజనేయుల ప్రేమ, వెంకటేశ్వర స్వామి చిత్రాలు పెన్సిల్ తో గీసి, పరిశ్రమలోని సన్నహితులకు బహుమతులుగా పంపారు.
undefined
మట్టితో కూడా విగ్రహాలు చేయడంలో బ్రహ్మానందం దిట్ట అని చెప్పాలి. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బ్రహ్మానందం తన కళలతో వినోదం పంచుతున్నారు.
undefined
click me!