రీమేక్స్ తో బ్లాక్ బస్టర్స్, చిరంజీవి ఇమేజ్ మార్చేసిన ఆ చిత్రాలు ఏమిటో తెలుసా?

First Published | Nov 1, 2024, 5:00 PM IST

రీమేక్ సెంటిమెంట్ చిరంజీవికి బాగానే కలిసొచ్చింది. ఆయన పలు హిట్ ఖాతాలో వేసుకున్నాడు. చిరంజీవి కెరీర్లో చేసిన రీమేక్స్ ఏమిటో చూద్దాం.. 
 

Mohan Babu

ఎవర్ గ్రీన్ స్టార్ గా ఎదిగిన చిరంజీవి 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 156 చిత్రాలు చేశారు. విశ్వంభర మూవీ సెట్స్ పై ఉంది. హీరోగా చిరంజీవి సాధించిన రికార్డ్స్ మరొక హీరోకి సాధ్యం కావేమో. అంతులేని స్టార్ డమ్ ఆయన అనుభవించారు. దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. 
 


ఆయనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో అనేక రీమేక్స్ ఉన్నాయి. రీమేక్స్ అంటే చిన్న చూపు ఎందుకు, అసలు అవే నటుడికి నిజమైన ఛాలెంజ్ అని చిరంజీవి అంటారు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయన అనేక రీమేక్స్ చేశారు. ఇక రీమేక్ సెంటిమెంట్ ఆయనకు కలిసి రావడం విశేషం. అనేక హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇతర భాషల చిత్రాలు రీమేక్ చేసి సాధించారు. మరి కెరీర్ లో చిరంజీవి చేసిన రీమేక్స్ ఏమిటో చూద్దాం... 

చిరంజీవి గత ఏడాది విడుదల చేసిన గాడ్ ఫాదర్ రీమేక్. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మలయాళ చిత్రం లూసిఫర్ కి అధికారిక రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించారు. అలాగే భోళా శంకర్ సైతం రీమేక్. అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం వేదాళం కి రీమేక్. భోళా శంకర్ మూవీ మాత్రం నిరాశ పరిచింది. 
 

Latest Videos


రాజకీయాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి 2017లో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఖైదీ నంబర్ 150... విజయ్ తమిళ చిత్రం కత్తి రీమేక్. ఖైదీ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. 

హిందీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ని చిరంజీవి తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రానికి సీక్వెల్ గా లగేరహో మున్నాభాయ్ వచ్చింది. దాన్ని చిరు తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ టైటిల్ తో చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది. 
 

ఇక చిరంజీవి కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఠాగూర్ ఉంది. ఈ సినిమా చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కాంత్ నటించిన రమణ అనే తమిళ చిత్రం రీమేక్. ఠాగూర్ అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. 

వరుస ప్లాప్స్ లో ఉన్న చిరంజీవిని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం హిట్లర్. చిరంజీవి ఐదుగురు చెల్లెళ్ళకు అన్నగా నటించారు. హిట్లర్ మమ్ముట్టి అదే టైటిల్ తో చేసిన మలయాళ చిత్ర రీమేక్ కావడం విశేషం. ఇక ఘరానా మొగుడు చిత్రాన్ని కన్నడ మూవీ అనురాగ అరళితు చిత్ర రీమేక్ గా చేశారు. ఘరానా మొగుడు మంచి విజయం అందుకుంది. 
 

Chiranjeevi

యాక్షన్ ఎంటర్టైనర్ ఖైదీ నెంబర్ 786 విజయ్ కాంత్ నటించిన తమిళ చిత్రం అమ్మన్ కోవిల్ కళావలె రీమేక్. ఇక పసివాడి ప్రాణం చిరంజీవి హిట్ చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇది మలయాళ చిత్రం పూవిన్ను పుతియా పుంతేన్నెల్ చిత్ర రీమేక్. 

వీటితో పాటు చిరంజీవి హిట్ చిత్రాలైన  దొంగ మొగుడు, విజేత, అడవి దొంగ, ఇంటి గుట్టు, దేవాంతకుడు, ఖైదీ, అభిలాష రీమేక్స్ కావడం విశేషం. చిరంజీవి కెరీర్ లో విజేత, ఖైదీ చిత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన్ని హీరోగా నిలబెట్టిన చిత్రాలు అవి. చిరంజీవి దశను మార్చేశాయి. 
 

 ఇమేజ్ రాకముందు కూడా ఆయన రీమేక్స్ చేశారు.  మంచు పల్లకీ, యమ కింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, చట్టానికి కళ్ళు లేవు చిరంజీవి చేసిన ఇతర భాషా చిత్రాల రీమేక్స్. చిరంజీవి నిర్మించుకున్న మెగాస్టార్ అనే ఇమేజ్ కోటకు మెట్లుగా అనేక రీమేక్ చిత్రాలు ఉన్నాయి. భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో అభిమానుల నుండే వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో రీమేక్స్ పట్ల చిరంజీవి ఆసక్తి తగ్గించారు. 
 

click me!