ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. 9వ వారానికి గాను యష్మి, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని నామినేట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం యష్మి ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంది. ఆమెకు భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయని సమాచారం.
ఇక రెండో స్థానంలో గౌతమ్, మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో హరితేజ, నయని పావని ఉన్నారు. రెండు రోజుల క్రితం వరకు హరితేజ చివరి స్థానంలో ఉంది. ఓటింగ్ మెరుగు పరుచుకున్న హరితేజ నయని పావనిని వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో నిలిచిందట. కాబట్టి నయని పావని ఎలిమినేట్ కానుందనే ప్రచారం మొదలైంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్లో ప్రవేశ పెట్టారు. మొత్తం 8 మంది ఐదు వారాల అనంతరం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. వారిలో నయని పావని ఒకరు. నయని పావని సీజన్ 7 కంటెస్టెంట్. గత సీజన్లో కూడా నయని పావని వైల్డ్ కార్డ్ ద్వారా ఐదు వారాల తర్వాత హౌస్లో అడుగుపెట్టింది. అయితే ఆమె జర్నీ వారం రోజుల్లోనే ముగిసింది. దాంతో ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు.
సీజన్ 8లో నయని పావని ఒకింత సింపతీ గేమ్ ట్రై చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఆడియన్స్ లో సింపతీ రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదని తెలుస్తుంది. నయని పావనికి ఆడియన్స్ ఓట్లు వేయలేదు. హౌస్లోకి వచ్చిన నాలుగు వారాల అనంతరం నయని పావని ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది.
అయితే సమీకరణాలు మారే అవకాశం ఉంది. 10వ వారం బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ చోటు చేసుకుంటుంది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వస్తారు. కొంత డ్రామా, ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకుంటాయి. హరితేజ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. దాంతో ఎమోషనల్ డ్రామా పండనుంది. అదే సమయంలో నయని పావని కోసం నటుడు శివాజీ వస్తాడనే ప్రచారం జరుగుతుంది.
నయని పావనికి శివాజీ అత్యంత సన్నిహితుడు. నయని పావనికి తండ్రి లేడు. బిగ్ బాస్ హౌస్లో పరిచయమైన శివాజీని ఆమె కన్నతండ్రిగా భావిస్తుంది. వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంది. శివాజీ ప్రస్తావన తెస్తే నయని పావని ఏడ్చేస్తుంది. గత సీజన్లో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి రావడం ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని అనడంలో సందేహం లేదు.
నయని పావని కోసం శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే క్రమంలో ఆమె ఎలిమినేట్ కాకపోవచ్చని అంటున్నారు. నయని పావనికి బదులు హరితేజ మీద వేటు పడే అవకాశం ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు కేవలం ఓట్ల ఆధారంగా కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తారనే దానికి ఎలాంటి ఆధారం లేదు. వాళ్లకు టీఆర్పీ ముఖ్యం. ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా అనేకమార్లు ఎలిమినేషన్స్ చోటు చేసుకున్నాయి. కాబట్టి ఏదైనా జరగొచ్చు..
ఇక గత ఎనిమిది వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్యం ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఒకరు నిష్క్రమించనున్నారు. 12 మంది 10వ వారంలో అడుగు పెడతారు.