అప్పట్లో అమ్మ కోసం లక్ష రూపాయలు అత్యవసరం, నా దగ్గర లేవు, ఏం చేసానంటే : రాజమౌళి

First Published | Sep 26, 2024, 3:59 PM IST

ప్రారంభం రోజుల్లో అందరిలాగే రాజమౌళి డైరక్టర్ అవ్వాలని ఇబ్బందులు పడలేదు కానీ ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. 

rajamouli

  రాజమౌళి డైరక్టర్ గా  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు గర్వపడే స్దాయిలో  సినిమా ఖ్యాతిని పెంచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత సెన్సెషన్ సక్సెస్  అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు 1500కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

దర్శక ధీరుడిగా రాజమోళికి మంచి పేరు ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా చేసిన విషయం తెలిసిందే. తన గురువు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి 'శాంతినివాసం" టివి సీరియల్, 'స్టూడెంట్ నెం.1" చిత్రం చేసాడు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు. రాజమౌళి సినిమా అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తూ ఉంటారు. 


అయితే ప్రారంభం రోజుల్లో అందరిలాగే రాజమౌళి డైరక్టర్ అవ్వాలని ఇబ్బందులు పడలేదు కానీ ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. అయితే అప్పుడు ఆయనకు అండగా నిలిచించి మాత్రం గురువు రాఘవేంద్రరావు. ఆ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పుకొచ్చారు.  రాజమౌళి మాట్లాడుతూ...అప్పట్లో ఆర్దిక ఇబ్బంది వచ్చింది.

అమ్మని యుఎస్ పంపించాలి డబ్బులు లేవు,  వెళ్లి రావటానికి, ఖర్చులకు ఓ లక్ష రూపాయలు కావాలి. మాకు వేరే సోర్స్ ఏమీ లేదు. అప్పట్లో అది పెద్ద ఎమౌంట్.  డైరక్టర్ రాఘవేంద్రరావు గారికి ఇలా చెప్పాలి. అక్క ప్రెగ్నింట్, అమ్మ వెళ్లాలి ఇలా చెప్పాలి అని  ప్రిపేర్ అయ్యాను.  ఎలా అడగాలో అర్దం కాక ఆలోచిస్తున్నాను.  
 

ఒకటికి రెండు సార్లు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్లి..సార్ ఒక లక్ష రూపాయలు కావాలండీ అని ఇంకా చెప్పబోతున్నాను..అప్పుడు రాఘవేంద్రరావు గారు వెంటనే నేను చెప్తాను ఆఫీస్ కు వెళ్లి తీసుకో అన్నారు. ఇంట్లో ఎవరినైనా సరే ఓ లక్ష రూపాయలు అడిగామనుకోండి. ఇస్తారు. కానీ ఎందుకు అని అడుగుతారు కదా, కానీ ఆయన అడగలేదు. ఎందుకు ఏమిటి అనలేదు అంటూ రాఘవేంద్రరావు తనను గురువుగానే కాకుండా శ్రేయాభిలాషిగా ఆదుకున్న విధానం రాజమౌళి చెప్పుకొచ్చారు. 
 

Rajamouli

మరో ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గురించి రాజమౌళి మాట్లాడుతూ 'రాఘవేంద్రరావుగారి సినిమాలకు కథాబలం ఉండదు. సింపుల్ గా సినిమాని తేల్చేస్తారు. స్క్రీన్ ప్లే పరంగా ఎంత పకడ్బందీగా సినిమా చేసినప్పటికీ చివరికి సినిమా తేలిపోతుంది.

కానీ టేకింగ్ విషయంలో మాత్రం ఆయన నెంవర్ వన్. ఆయన దగ్గర్నుంచి ఈ విషయంగా నేను చాలా నేర్చుకున్నాను. క్లోజ్ లు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి డ్రామాని అద్బుతంగా తెరకెక్కిస్తారు రాఘవేంద్రరావు"అని చెప్పారు.
 

Mahesh Babu and Rajamouli

  ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా మొదలు కానుంది.

ఇక ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారన్నది చూడాలి. మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మరో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Latest Videos

click me!