ఆ క్షణం చచ్చిపోతానేమో అనుకున్నా,పెళ్లాం బిడ్డలు గుర్తొచ్చారు: ఎన్టీఆర్ షాకింగ్‌ కామెంట్స్

First Published | Sep 26, 2024, 4:41 PM IST

బయటికి వెళితే ఎండ, లోపల వేడి..  బయటికి వెళితే తందూరీ చికెన్ లాగా మాడిపోవడం, లోపల ఉంటే ఇడ్లీలా ఉడికిపోవడం, ఏం చేయాలో తెలియలేదు. 

devara

ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రం దేవర మూవీ మరి కొద్ది గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రమోషన్స్ చేశారు. ఆ క్రమంలో అనేక ఆశ్చర్యకరమైన విశేషాలు షేర్ చేసుకున్నారు.  మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలలో   తారక్ మాట్లాడిన మాటలు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాయి. వాటిలో ఒకటి వైరల్ అవుతోంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

NTR


 ఆ ఇంటర్వ్యూలో తారక్  మాట్లాడుతూ.." గోవాలో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ చాలా వేడిగా ఉంది. ఆ టైంలో ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడ నిప్పుల వర్షం పైనుంచి కురుస్తుందా అన్నంత వేడిగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది. ఆ టైంలో నాకు నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. అంటే అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. 
 



ఆ టైంలో ఒక సీన్ నేను నవ్వుతూ చేయాల్సి ఉంది. ఆ సీన్ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడూ రిలాక్స్ అవుదామా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా... ఆ సీన్ అయిపోగానే పక్కనే ఏసీ రూమ్ కనిపించింది. వెంటనే చాలా ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లిపోయి, ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నా అంతే..

ఒక్క నిమిషం కూడా కాలేదు వెంటనే పవర్ పోయింది. నా దరిద్రం ఏంటంటే అక్కడ జనరేటర్ కూడా లేదు. అప్పుడు చూడాలి... బయటికి వెళితే ఎండ, లోపల వేడి..  బయటికి వెళితే తందూరీ చికెన్ లాగా మాడిపోవడం, లోపల ఉంటే ఇడ్లీలా ఉడికిపోవడం, ఏం చేయాలో తెలియలేదు. 
 


వెంటనే ఫోన్ తీసి జనరేటర్ ఆన్ చేయమని అడుగుదాం అంటే ఆ ముందు రోజే జనరేటర్ పాడైపోయిందని చెప్పారు. ఇక రూమ్ లో ఉండాలో, బయటకు వెళ్లాలో నాకు అర్థం కాలేదు. 40 నిమిషాల దాకా కరెంట్ రాలేదు... తర్వాత కరెంట్ వచ్చింది. కాస్త రిలాక్స్ అవుదాం అనుకునేసరికి షాట్ రెడీ అని పిలిచారు. ఇక అంతే నా మీద నాకే ఛీ అనిపించింది, చిరాకేసేసింది" అని ఎన్టీఆర్ చెప్పారు.  

అయినా కథ చాలా కొత్తగా ఉంటుందని ,సినిమా చాలా బాగా వచ్చిందని ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయని, జాన్వి చాలా టాలెంటెడ్ అని, అనిరుధ్ సంగీతం చాలా బాగుందని ఎన్టీఆర్ పలు ఇంట్రస్టింగ్  విషయాలను పంచుకున్నారు.  
 

ఇక ఈ సినిమా చాలా శాతం సముద్రం పక్కనే షూట్ చేసారు. ఎక్కువగా అండమాన్, గోకర్ణ, గోవా, థాయ్ లాండ్ తో పాటు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ చేసారు. అలాగే సినిమాలో సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు దాదాపు అరగంట పాటు ఉండనున్నాయి. సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం మూవీ టీమ్ దాదాపు నెలరోజులకు పైగా కష్టపడ్డారు

అభిమానులు, ప్రేక్షకుల ఎక్సపెక్టేషన్స్ కు  తగినట్లుగానే దేవర మేకింగ్ ఉన్నట్లు ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి అర్దమవుతోంది. రీసెంట్ గా రిలీజైన  దేవర ట్రైలర్స్, సాంగ్స్, గ్లింప్స్ నెక్ట్స్ లెవిల్  లో ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో  యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ టిక్కెట్ సేల్స్  ఓ రేంజిలో ఉంటున్నాయి. 
 

 దేవర విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. ఇందులోని ‘చుట్టమల్లే..’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ‘దేవర’ మూవీలో కొన్ని సీన్స్  కలర్‌ టోన్‌ విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా నైట్‌ ఎఫెక్ట్‌ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్‌ తీశారు సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు.


ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ 4 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్) డబ్బింగ్‌ చెప్పారు. సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్రకు పి.రవిశంకర్‌ గాత్రాన్ని అందించారు.
 

Latest Videos

click me!