Allu Arjun తాత, అల్లు రామలింగయ్యను జీవితాంతం వెంటాడిన పాట ఏదో తెలుసా? సూపర్ స్టార్ కృష్ణ కు సబంధించిన ఆ పాటంటే ఆయనకు ఎందుకు అంత ఇష్టం. స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించిన నటుడు.
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్టరీలో అల్లు కుటుంబం కూడా మంచి ఫామ్ లో ఉంది. ఇండస్ట్రీలో మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, కుటుంబాలతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా వెలుగు వెలుగుతోంది. హాస్య నటుడిగా అల్లు రామలింగయ్య తో మొదలయ్యి.. ఆయన తనయుడు అల్లు అరవింద్ నిర్మాతగా రాణించగా.. ఆతరువాతి తరంలో అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తాత స్టార్ డమ్ ను అంతకంతకు పెంచి.. పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసి.. సంచలనంగా మారాడు.
25
అల్లు రామలింగయ్య సినిమా కెరీర్..
రంగస్థలం నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయిన అల్లు రామలింగయ్య.. తొలితరం హాస్యనటులలో సీనియర్. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన నటన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి.. దాదాపు మూడు తరాల హీరోలతో నటించి మెప్పించాడు అల్లు రామలింగయ్య. అంతే కాదు మరణించేవరకూ నటిస్తూనే ఉంటాను అనిచెప్పిన ఆయన.. అనట్టుగానే తుదిశ్వాస వరకూ నటించారు. వీల్ చైర్ లో కూర్చుని మరీ నటించిన ఏకైక స్టార్ యాక్టర్ అల్లురామలింగయ్య.. ఆయన చేసిన చివరి సినిమా కళ్యాణ రాముడు. ఈసినిమాలో వేణు తాతగా నటించి.. కామెడీతో అలరించాడు అల్లు.
35
అల్లు రామలింగయ్యను వెంటాడిన పాట..
అయితే అల్లు రామలింగయ్య తన కెరీర్ ను, తన ప్యామిలీని మంచి దారిలో నడిపించారు. తన కూతురిని మెగాస్టార్ చిరంజీవికిచ్చి పెళ్ళిచేశాడు. ఇటు మెగా ఫ్యామిలీ, అటు అల్లు ఫ్యామిలీ రెండు ఇండస్ట్రీలో ప్రముఖంగా మారాయి. అయితే అల్లు రామలింగయ్య తన జీవితంలో మర్చిపోలేని ఓ పాట గురించి.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కృష్ణ నటించిన సినిమాలోని పాట తనను జీవితాంతం వెంటాడిందని రామలింగయ్య చెప్పుకొచ్చారు.
అల్లు రామలింగయ్య మాట్లాడుతూ.. '' ఒక పాట మాత్రం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది. అది కిరాయి కోటిగాడు అనే సినిమాలో.. కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన పాట. నీయ్యమ్మ నాకతా.. నాయమ్మ నీకత్తా.. కూడబలుపుకుని కన్నారేమో.. కూడబలుపుకుని కన్నారేమో '' అని ఆ లిరిక్స్ ను అల్లు రామలింగయ్య స్వయంగా పాడి వినిపించారు. ఆ పాటను చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు అల్లు.. దానికి డ్యాన్స్ మూమెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ పాట ఎందుకో తెలియదు ఆయనకు చాలా ఇష్టమట.
55
అల్లు వారసత్వంలో దూసుకుపోతున్న బన్ని..
ఇక రామలింగయ్య వారసుడిగా అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన ఐకాన్ స్టార్ ఇమేజ్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియాను టచ్ చేసింది. బన్నీకి బాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులు తయారయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాకు సబంధించిన పని ముంబయ్ లో జరగుతోంది. అక్కడే ఇల్లు కూడా తీసుకున్నాడట అల్లు అర్జున్. షూటింగ్ అయిపోయే వరకూ అక్కడే ఉండబోతున్నట్టు తెలుస్తోంది.