రీతూ గాలి తీసిన సంజన, అది తప్ప హౌస్ లో చేసిందేమీ లేదు.. సహనం కోల్పోయిన ఇమ్మాన్యుయేల్, ఏం చేశాడో తెలుసా

Published : Nov 28, 2025, 02:44 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 షోలో భాగంగా 82వ రోజు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సంజన, రీతూ తీవ్రస్థాయిలో గొడవ పడుతున్నారు. పవన్, ఇమ్మాన్యుయేల్ మధ్య కూడా రచ్చ మొదలైంది. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చివరి దశ మొదలైంది. మరి కొన్ని వారాలు మాత్రమే ఆట మిగిలి ఉంది. కొంతమంది హౌస్ లో సర్వైవ్ అయ్యేందుకు, మరికొందరు టాప్ 5 లో నిలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం రోజు హౌస్ లో 82వ రోజు చివరి కెప్టెన్సీ టాస్క్ ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. చివరి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనేందుకు కంటెండర్లుగా దివ్య, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, రీతూ, సంజన, పవన్ అర్హత సాధించారు.

25
కెప్టెన్సీ టాస్క్ ఇదే

వీరిలో కెప్టెన్ ఎవరో తేల్చేందుకు బిగ్ బాస్ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత లేని సభ్యులు బజర్ మోగగానే డాగర్ ని అందుకుని తాము ఎవరు కెప్టెన్ కావాలని భావిస్తారో ఆ కంటెండర్ కి ఇవ్వాలి. డాగర్ పొందిన కంటెండర్.. మిగిలిన కంటెండర్లలో తమకి ఇష్టం లేని వాళ్ళ బోర్డులకు గుచ్చి కారణాలు చెప్పాలి.

35
సంజనపై రీతూ ఫైర్

ఈ టాస్క్ లో సుమన్ శెట్టి డాగర్ అందుకుని రీతూకి ఇచ్చారు. రీతూ దానిని సంజన బోర్డుకి గుచ్చింది. గేమ్ ఆడుతున్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. కానీ మీరు హౌస్ లో ఉన్నవారందరిపై బిలో ది బెల్ట్ మాట్లాడారు అని రీతూ సంజనపై ఆరోపణలు చేసింది. సంజన చాలా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అసలు నీ గేమ్ ఏముంది రీతూ..ఉదయాన్నే లేస్తావ్.. నువ్వు ఆ మూలకు పోతావ్, పవన్ ఇంకో మూలకి పోతాడు.

45
రీతూ గాలి తీసిన సంజన

తర్వాత వచ్చి పవన్ తో ప్యాచ్ అప్ చేసుకుంటావ్.. ఇంతకు మించి నీ గేమ్ ఏముంది అంటూ సంజన రీతూ గాలి తీసింది. ఆ తర్వాత భరణి డాగర్ అందుకుని పవన్ కి ఇచ్చారు. పవన్ డాగర్ ని ఇమ్మాన్యుయేల్ బోర్డుకు గుచ్చారు. తాను అడిగినప్పుడు ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేయలేదు అనే అంశాన్ని పవన్ లేవనెత్తారు. నేను గెలవాలి అంటే నా ప్రత్యర్థి బలంగా ఉండకూడదు. అది నా స్ట్రాటజీ, అదే గేమ్ అంటే అని ఇమ్మాన్యుయేల్ పవన్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

55
సహనం కోల్పోయిన ఇమ్మాన్యుయేల్

అన్నా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తాది, నువ్వు నవ్వితే నవ్వు వస్తాది ఇలాంటి మాటలు నాకు చెప్పకురా అంటూ ఇమ్మాన్యుయేల్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తన మెడలో ఉన్న బోర్డుని తీసి విసిరి కొట్టాడు. చూస్తుంటే కెప్టెన్సీ టాస్క్ తో హౌస్ దద్దరిల్లేలా ఉంది. అందుతున్న సమాచారం మేరకు కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ విజయం సాధించినట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories