సీఎం ఆఫీస్‌కి వచ్చి ముద్దు పెట్టిన అమ్మాయి.. నగలతో వచ్చి పెళ్లికి డిమాండ్‌, ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలుసా?

First Published | Nov 30, 2024, 3:38 PM IST

ఎన్టీఆర్‌ కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేసిందట. అంతేకాదు ముద్దు పెట్టిందట. 
 

సినిమా హీరో, హీరోయిన్లకి చాలా మంది అభిమానులు ఉంటారు. తమ ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరైతే ప్రేమ కోసం పిచ్చోళ్లైపోతారు. మరికొందరు పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి కూడా చేస్తుంటారు. అంతేకాదు చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో మారాం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సీనియర్‌ ఎన్టీఆర్‌కి కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్‌) ఒక యుగ పురుషుడు. ఆయన హైట్‌, లుక్‌ ఇలా వీరుడులా ఉంటారు. అద్బుతమైన నటనతో వెండితెరని రక్తికట్టిస్తారు. దీంతో ఆటోమెటిక్‌గా ఆయనకు ఆడియెన్స్ అభిమానులుగా మారిపోతారు. అలా కోట్ల మంది ఆయన్ని ఆరాధించారు. అయితే కొందరిలో ఆ అభిమానం కట్టలు తెంచుకుంది. పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ వరకు వచ్చిందట. అది రామారావు ఫేస్‌ చేయాల్సి వచ్చిందట. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆ తాకిడి ఉందట. 


ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఓ ఇద్దరు అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేశారట. అంతేకాదు ఓ అమ్మాయి తెలివిగా రామారావుని కలిసి ముద్దు కూడా పెట్టిందట. ఆ సంగతేంటో చూస్తే ఓ అమ్మాయి నెల రోజులుగా సీఎం క్యాంప్‌ ఆఫీసుకి వస్తుందట. తనతో ఓ బ్యాగ్ కూడా ఉంది. రోజూ ఎన్టీఆర్‌ని కలిపించాలని సెక్యూరిటీని రిక్వెస్ట్ చేస్తుంది.

కానీ వాళ్లు అనుమతించడం లేదు. దీంతో ఎవరితో పనవుతుందో తెలుసుకుని ఎన్టీఆర్‌ డ్రైవర్‌ని పట్టుకుంది. డ్రైవర్‌ లక్ష్మణ్‌ని కూడా చాలా రోజులుగా బతిమాలుతుంది. దీంతో ఎట్టకేలకు ఓ రోజు సెక్యూరిటీ ఆఫీసర్‌తో మాట్లాడి ఎన్టీఆర్‌ని కలిసేలా చేశారు. 
 

ఆయనకు ఈ విషయం చెప్పడంతో లోపలకి రమ్మని చెప్పారట. అయితే ఎన్టీఆర్‌ ఆఫీస్‌లో కూడా సీసీ కెమెరాలుంటాయి. పోలీసులు గమనిస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి లోపలకి వెళ్లి బ్యాగ్‌లో నుంచి పదులకొద్ది లెటర్స్ ఎన్టీఆర్‌ ముందు ఉంచింది. ఆయన ఆశ్చర్యంగా వాటిని చదివాడు. చూస్తే లవ్‌ లెటర్స్.

ఎన్టీఆర్‌పై ప్రేమతో రాసుకున్న లెటర్‌. అవి చదువుతుండగానే ఆయనకు ముద్దు పెట్టిందట. దీంతో వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ బటన్‌ నొక్కాడు. సెక్యూరిటీ లోపలికి వచ్చారు. బ్యాగ్‌ చెక్‌ చేస్తే మొత్తం నగలే. అప్పట్లోనే ఏడెనిమిది లక్షల విలువ ఉంటుంది. 
 

పోలీసులు రావడంతో సర్‌ నన్ను పెళ్లి చేసుకోండి, మీకు వండి పెడతా, ఏదంటే అది చేస్తానని రిక్వెస్ట్ చేసిందట. ఆ అమ్మాయి గురించి ఆరా తీస్తే ఎన్టీఆర్‌పై ఇష్టంతో ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసమే ఉందట. అంతేకాదు తన పెళ్లికోసం దాచిన నగలు మొత్తం తీసుకుని ఆయన వద్దకు వచ్చేసిందట.

ఈ విషయం అర్థమై అమ్మాయికి నచ్చ చెప్పి సెక్యూరిటీని ఇచ్చి ఆమె ఇంటి వద్ద డ్రాప్‌ చేయించాడట ఎన్టీఆర్. ఆ తర్వాత కారు ఎక్కి లక్ష్మణ్‌కి క్లాస్‌ పీకాడట. పెళ్లి చేసుకోమంటుందు చేసుకోనా అని అన్నాడట. అంతేకాదు ముద్దు ఇచ్చిందని కూడా చెప్పాడట. అలా ఓ స్టోరీ సుఖాంతం అయ్యింది.

ఆ తర్వాత మరో స్టోరీ. మరో అమ్మాయి పాష్‌గా ఉందట. ఇంగ్లీష్‌ పేపర్‌ చదువుతూ కనిపిస్తుంది. తాను ఎక్కిడికి వెళ్లితే అక్కడికి వస్తుందట. హాయ్‌ చెబతుందట. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమెనే కనిపిస్తుందట. ఢిల్లీ వెళ్లినా అక్కడికి కూడా వస్తుందట. ఎన్టీఆర్‌ బర్త్ డే రోజు అందరు ఆయన్ని కలిసి విషెస్‌ చెబుతున్న నేపథ్యంలో వారితోపాటు ఈ అమ్మాయిని కూడా పంపించారట.

ఆ సమయంలో అందరి ముందు ఆమె కూడా తనని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసిందట. కాళ్ల వేళ్లా పడిందట. ఆమెకి కూడా నచ్చచెప్పి ఇంటికి పంపించాడట ఎన్టీఆర్‌. ఆడవారు, అమ్మాయిలతో చాలా బాగా ఉండేవారట ఎన్టీఆర్. వారికి చాలా గౌరవం ఇచ్చేవారట. అందుకే ఆయనకు అంతగా క్రేజ్‌ ఉండేదన్నారు ఎన్టీఆర్‌ పర్సనల్‌ డ్రైవర్‌ లక్ష్మణ్‌. 

red more:`హరిహర వీరమల్లు` కొత్త లుక్‌, పవన్‌ ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కదా.. అదిరిపోయే గుడ్‌ న్యూస్‌

also read: నయనతార, మంజు వారియర్.. పారితోషికంలో టాప్ 7 హీరోయిన్స్
 

Latest Videos

click me!