పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డీప్యూటీ సీఎంగా దుమ్ములేపుతున్నాడు. కోస్టల్ ఏరియాలో అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న నేపథ్యంలో అక్రమార్కుల ఆటలు కట్టించాడు. ఏకంగా షిప్పునే సీజ్ చేసి మొత్తం కోస్టల్ ఏరియాకే ఝలక్ ఇచ్చాడు పవన్. పొలిటికల్‌గా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు సినిమా పరంగానూ రచ్చ చేసేందుకు వస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చాలా కాలంగా పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. కొన్ని రోజులు షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ కావడంతో టైమ్ కుదరడం లేదు. తాజాగా ఆయన సినిమా ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. శనివారం నుంచి ఆయన `హరిహర వీరమల్లు` సినిమా సెట్‌లోకి జాయిన్ అయ్యారు.
పవన్ కళ్యాణ్‌పై కీలకమైన యాక్షన్ సీన్లు చిత్రీకరించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పవన్ టైమ్ ఇవ్వడమే కష్టం కాబట్టి, డేట్స్ ఇచ్చిన రోజుల్లో సాధ్యమైనంతగా ఆయనపై షూటింగ్ చేసేలా టీమ్ ప్లాన్ చేయడం విశేషం.
ఇక శనివారం పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` సినిమా సెట్‌లో పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తూ టీమ్ కొత్త పోస్టర్‌ని పంచుకుంది. సెట్‌లోని పవన్ లుక్‌ని విడుదల చేసింది. `ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు` అని పేర్కొంది టీమ్. ఇదే సినిమాకి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ అని తెలుస్తుంది. ఇక విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో పవన్ కటౌట్ వేరే లెవల్‌లో ఉందని చెప్పొచ్చు.
ఓ కొండపై నుంచి చూస్తున్నట్టుగా పవన్ లుక్ ఉంది. ఆయన వీరమల్లు గెటప్‌లో ఉన్నారు. చేతిలో అప్పట్లో వాడే పిస్తోల్ ఉంది. వీరుడుని తలపించేలా పవన్ లుక్ ఉండటం విశేషం. పవన్ ఫ్యాన్స్ కోరుకునేలా ఈ సరికొత్త లుక్ ఉంది. అయితే బ్యాడ్ సైడ్ ఫోటో కావడం గమనార్హం. బ్యాక్ సైడ్ లుక్కే ఇంత పవర్ ఫుల్‌గా ఉంటే ఇక ఫ్రంట్ లుక్ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో `హరిహర వీరమల్లు` సినిమాని హిస్టారికల్ మూవీగా రూపొందిస్తున్నారు. బందిపోటు వీరమల్లు పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగబోతుందట. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఔరంగజేబుకి వ్యతిరేకంగా వీరమల్లు సంపదని కొల్లగొట్టి పేదలకు పంచడం, మొఘల్స్ నుంచి కొహినూర్ వజ్రాన్ని దొంగిలించడం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. బాలీవుడ్ భామలు నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం కొడుకు, దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కొన్ని విభేదాల నేపథ్యంలో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు.
కాకపోతే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఏఎం రత్నం అన్నీ తానై చూసుకుంటున్నారు. మేఘ సూర్య ప్రొడక్షన్‌పై ఏఎంరత్నం, ఏ దయాకర్ రావు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నారు.
Read more:నయనతార, మంజు వారియర్.. పారితోషికంలో టాప్ 7 హీరోయిన్స్
also read: ప్రభాస్ విలన్‌గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్