నాలుగు రోజుల్లో పెళ్లి.. శోభిత, చైతన్య గురించి గూగుల్ లో నెటిజన్లు ఏం వెతుకుతున్నారో తెలుసా 

First Published | Nov 30, 2024, 1:45 PM IST

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట మరో నాలుగు రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జోరుగా పెళ్లి కార్యక్రమాలు సాగుతున్నాయి. 

Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట మరో నాలుగు రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జోరుగా పెళ్లి కార్యక్రమాలు సాగుతున్నాయి. నాగ చైతన్య కోరిక ప్రకారం పెళ్లి సింపుల్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కానున్నారట. వారిలో నాగ చైతన్యతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు ఉంటారని టాక్. 

మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగబోతుండగా నెటిజన్లు చైతు, శోభిత గురించి ఒక విషయం తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో తెలుసా ? శోభిత, నాగ చైతన్య వయసు.. అదే విధంగా వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 


ఇటీవల అఖిల్ నిశ్చితార్థం జరిగింది. జైనబ్ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. అప్పటి నుంచి జైనబ్ వయసు గురించి అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె వయసు 39 ఏళ్ళు అని..అఖిల్ కంటే 9 ఏళ్ళు పెద్ద వయసు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోచైతు, శోభిత వయసు గురించి కూడానా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 

Akhil

నాగ చైతన్య వయసు 38 ఏళ్ళు.. శోభిత వయసు 32 ఏళ్ళు. అంటే చైతు శోభిత కంటే ఆరేళ్ళు పెద్దవాడు. వీరిద్దరి జోడి పర్ఫెక్ట్ గానే ఉంది అని నెటిజన్లు అంటున్నారు. మరి అఖిల్ కి కాబోయే భార్య వయసు నిజంగా 39 ఏళ్ళు అయితే మాత్రం షాకింగే. 

Latest Videos

click me!