Liger : ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ : పక్కా పూరీ మాస్ కమర్షియల్..!

Published : Aug 24, 2022, 07:13 PM ISTUpdated : Aug 24, 2022, 07:14 PM IST

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. రేపు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా.. తాజాగా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందనే విషయాలు తెలుసుకుందాం..  

PREV
16
Liger : ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ : పక్కా పూరీ మాస్ కమర్షియల్..!

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 
 

26

మూడేండ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేళలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా విడుదల కాబోతుండటంతో తాజాగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 
 

36

ఓవర్సీస్ పెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా ‘లైగర్’ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు.  ఆయన సమీక్ష ప్రకారం.. చిత్రం పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. సినిమా మొత్తానికి విజయ్ దేవరకొండ పెర్ఫామెన్సే హైలెట్ గా నిలవనుంది. అన్ని రకాలుగా విజయ్ తన నటనతో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం ఖాయం. అద్భుతంగా నటించాడని అభిప్రాయపడ్డారు.
 

46

మరోవైపు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కూడా డైరెక్షన్ తో తన మార్క్ చూపించాడు. సినిమాలో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్, డైరెక్షన్, డైలాగ్స్ ఉన్నాయి. రమ్యక్రిష్ణ సర్ ప్రైజ్ ప్యాకేజీగా నిలవనుంది. కథ, స్క్రీన్ ప్లే రోటీన్ గా ఉన్నా.. పలు సీన్లు మాత్రం విజిల్స్ వేయించేలా ఉన్నాయని’ ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. 

56

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేపే గ్రాండ్ గా (ఆగస్టు 25) ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ అవుతుంది. గతంలోనే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు ఆడియెన్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను అందించారు. అలాగే చిత్ర ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ ఒక రేంజ్ లో నిర్వహించడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. 
 

66

చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - అనన్య పాండే  జంటగా నటించారు. మూవీ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీలో  రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories