ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటాడు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్, చాలా రోజుల తర్వాత నవ్వుతున్నావు అని అనగా తులసి గారిలో నాకు అమాయకత్వం, అమ్మతనం, చిన్నపిల్లతనం, ఒక కాళికాదేవి అన్ని కనిపిస్తున్నాయి. హనీ నీ సొంత కూతురిలా చూసుకుంటున్నారు, పాతికేళ్లు ఇంట్లో బంధీగా ఉన్న సరే ఇప్పుడు బయటికి వచ్చి తన ప్రపంచం చూస్తూ బతకాలి అనుకుంటుంది.పక్క వాళ్ళ దగ్గర పైసా కూడా తీసుకోకుండా తన కాలు మీద నిలబడి కుటుంబానికి పోషిస్తుంది అని అంటాడు.