రామ్ గోపాల్ వర్మ కు ఫోన్ చేసి బండబూతులు తిట్టిన దర్శకుడు ఎవరో తెలుసా..?

First Published | Nov 2, 2024, 10:39 PM IST

ఆర్జీవి అంటేనే అందరికి భయం. . ఎప్పుడు ఎవరిని ఏం అంటాడో  అని... ఎవరిని టార్గెట్ చేస్తాడో అని. అటువంటి ఆర్జీవినే బండ బూతులు తిట్టాడట ఓ దర్శకుడు ఇంతకీ ఎవరతను..? 

ఆర్జీవి అంటే ఎంటో అందరికి తెలిసిందే. ఈమధ్య కాస్త కామ్ అయ్యాడు కాని.. ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ లేదు. ఎంత పెద్దవాళ్ళైనా తనదైన స్టైల్ లో ట్రోల్ చేయడంతో వర్మ తరువాతే ఎవరైనా. మొదటి మంచి మంచి సినిమాలు.. సూపర్ డూపర్ హిట్లు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత నుంచి బూతు సినిమాల దర్శకుడిగామారిపోయారు.
 

 ఒకప్పుడు ఎంత పెద్ద హిట్టు చేశాడో.. అంతకు అంత డౌన్ అయ్యాడు వర్మ. 1990 లో  శివ సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ ఒక్క దెబ్బకు అటు నాగార్జున కెరీర్.. ఇటు వర్మ కెరీర్ రెండు సెట్ అయ్యాయి. ఇక ఆతరువాత ఆయన తీసిన సినిమాలు.. వేసిన వేశాలు అన్నీ అందరికి తెలిసిందే. 

Also Read: శ్రీదేవిని తమిళ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్న తల్లి, మధ్యలో బోనీకపూర్ ఎలా వచ్చాడంటే..?


తెలుగు రాష్ట్రాల్లో వర్మ మార్క్ రాజకీయాలు అందరు చూశారు. జగన్ కు సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ ను టార్గెట్ చేస్తూ.. ఆయన చేసిన సోషల్ మీడియా యుద్దం అంతా ఇంతా కాదు. అంతే కాదు ఈ ముగ్గురిపై సినిమాలు కూడా చేశారు.  కాని జగన్ ఘోర పరాజయం తరువాత వర్మ సైలెంట్ అయ్యారు పొలిటికల్  గా ఏమాత్రం పట్టించకోవడంలేదు. 

ట్వీట్లు వేయడంలేదు. ప్రతి ఒక్కరిని వర్మ టార్గెట్ చేసి.. దారుణంగా ట్రోలో చేసేవారు. ఎవరు ఏమన్నా పట్టించుకనేవారుకాదు. సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శిస్తే.. వారికి గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చేవారు.అటువంటి వర్మను డైరెక్ట్ గా ఫోన్ చేసి తిట్టడం అంటే ఎవరికి ధైర్యం ఉంటుందో చెప్పండి. కాని ఒ దర్శకుడు మాత్రం ఆయనకు ఫోన్ చేసి తిట్టాడట ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?

Also Read:  బిగ్ బాస్ హౌస్ లో ఘాటు రొమాన్స్ , దుప్పట్లో దూరి రెచ్చిపోయిన ఆ ఇద్దరు, హోస్ట్ ఎందుకు పట్టిచుకోవడంలేదు..?  

ప్రస్తుతం  ఇండస్ట్రీ లో ఉన్న ఒక స్టాఫ్ డైరెక్టర్ ఒకప్పుడు గోపాల్ వర్మ చేసిన సినిమా నచ్చకపోవడంతో బాగా తాగి ఆర్జీవీ కి ఫోన్ చేసి మరి ఆ సినిమా అలా ఎందుకు తీసావ్ అని బండ బూతులు తిట్టాడ. అయితే  నిజానికి ఆయన వర్మ అభిమానే తన అభిమాన దర్శకుడు అలా సినిమా తీయడం నచ్చకపోవడంతో ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేక బండబూతులు తిట్టినట్టుగా ఓ  ఇంటర్వ్యూలో ఆ దర్శకుడే వెల్లడించాడు. 

Also Read:  మెగాస్టార్ ఫ్యామిలీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్, చిరంజీవి-మోహన్ బాబు ఎవరు లెజండ్..?

ఇంతకీ ఆయన ఎవరో కాదు అజయ్ భూపతి. అదేనండి ఆర్ ఎక్స్ 100 సినిమాతో అదరిపోయే సినిమా చేసిన అజయ్ భూపతి. ఆయన సినిమాల్లో కూడా వర్మ ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. ఈమధ్యే మంగళవారం సినిమాతో మంచి సక్సెస్ ను కూడా అందుకున్నాడు అజయ్. వర్మ దగ్గర పనిచేసిన అజయ్.. సినిమాల విషయంలో కాస్త వర్మను ఫాలో అవుతుంటాడు. 

Also Read: అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

వర్మ కూడా ఇలా ముఖం మీద చెప్పేవాళ్లంటే ఇష్టపడతారు. అందుకే అజయ్ భూపతి ఎంత తిట్టినా.. ఆయన్ను మాత్రం తనదగ్గరే ఉంచుకున్నాడట వర్మ. వర్మే కాదు ఆయన దగ్గర పనిచేసే వాళ్లు కూడా ఇలానే ఉంటారని ఇప్పుడు జనాలకు అర్ధం అయ్యి ఉంటుంది కదా..? 

Latest Videos

click me!