బాలయ్యతో గొడవ, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. దీనికోసమా ఫ్యాన్స్ కొట్టుకునేది?

First Published | Nov 2, 2024, 9:04 PM IST

బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య గ్యాప్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా విడిపోయి సోషల్‌ మీడియాలో కొట్టుకుంటున్నారు. అయితే బాబాయ్‌తో గొడవపై తారక్‌ ఏం చెప్పాడంటే?
 

నందమూరి ఫ్యామిలీలో విభేదాలున్నాయనే కామెంట్‌ తరచూ వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ఈ గొడవ చాలా పెరిగింది. బాలయ్యకి, ఎన్టీఆర్‌కి పడటం లేదని, నందమూరి ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా దీనిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల క్రితం నుంచి ఈ రూమర్స్ ఉన్నాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

చాలా ఏళ్లుగా బాలయ్యకి, ఎన్టీఆర్‌కి పడటం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కారణాలేంటనేది తెలియదు. ఫ్యామిలీ ఇష్యూస్‌ బయటకు రావడం చాలా కష్టం. సినిమాలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తుంటాయిగానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ అంత ఈజీగా బయటకు రావు. దీనిపై అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఆ రూమర్స్ మరింతగా పెరిగిపోతున్నాయి. 
 


దీనిపై ఎట్టకేలకు ఎన్టీఆర్‌ ఓపెన్‌ అయ్యారు. అయితే ఆయనే స్వయంగా మాట్లాడలేదు. నటుడు జగపతిబాబు దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్‌తో ఆయన ఈ విషయాన్ని చర్చించారట. ఏంటీ తారక్‌ బాలయ్యతో గొడవేంటి? మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని అడిగాడట. దానికి ఎన్టీఆర్‌ ఏం చెప్పాడో వెల్లడించారు.

`నాకేంటి బాబాయ్‌ ఆయనతో గొడవ, నాకు ఎలాంటి సమస్య లేదు. అసలు ప్రాబ్లమ్ ఏంటో కూడా తెలియదు. నా ఫాదర్‌ బ్రదర్‌ ఆయన, నాకు ఫాదర్‌ లాంటి వారు. నాకు ఆయనతో గొడవ ఎందుకు ఉంటుంది. గొడవ ఎలా పెట్టుకుంటాను. ఎప్పటికైనా నేను ఓపెన్‌గానే ఉన్నాను` అని క్లీయర్‌గా చెప్పినట్టు వెల్లడించారు జగపతిబాబు. 
 

అయితే జగపతిబాబు ఈ విషయం చెబుతున్నప్పుడు పక్కనే ఎన్టీఆర్‌ కూడా ఉండటం విశేషం. ఇది `నాన్నకు ప్రేమతో` సినిమా సమయంలో ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఈ విషయం చెప్పారు. అప్పట్లో వీరి మధ్య గొడవ ఉందనే కామెంట్ల నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఈ విధంగా చెప్పినట్టు జగపతిబాబు తెలిపారు.

అది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఏం లేనిది ఎందుకు కలిసి ఉండటం లేదు, ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారనేది పెద్ద సమస్యగా మారింది.  అయితే ఆ తర్వాత వీళ్లంతా కలిసిపోయారు. హరికృష్ణ చనిపోయినప్పుడు బాలయ్య, చంద్రబాబు నాయుడు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ముందుండి నడిపించారు. ఆ సమయంలో తారక్‌, కళ్యాణ్‌ రామ్‌లకు అండగానూ ఉన్నారు. 

అంతేకాదు ఆ సమయంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సినిమా ఫంక్షన్లకు కూడా బాలయ్య గెస్ట్ గా వచ్చి ఆశీర్వదించారు. అంతా కలిసిపోయారు. కానీ ఇటీవల మళ్లీ వీరిమధ్య గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు తారక్‌ స్పందించకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు తారక్‌ని టార్గెట్‌ చేశారు. సోషల్‌ మీడయా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేశారు. అప్పట్నుంచి ఈ రచ్చ నడుస్తూనే ఉంది.

ఓ రకంగా నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు కూడా. అయితే ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. లోకేష్‌, పవన్‌ కి అభినందనలు తెలిపారు. వాళ్లు కూడా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్స్ చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా రిలేషన్‌ బాగానే ఉంది. కానీ ఫ్యామిలీ పరంగా మాత్రం ఆ గ్యాప్‌ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి ఎప్పుడు పుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి. 

JNTR

బాలకృష్ణ ప్రస్తుతం `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. అలాగే బోయపాటి శ్రీనుతో సినిమాని ఆ మధ్యనే ప్రారంభించారు. ఇక తారక్‌ ఇటీవల `దేవర` సినిమాతో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం రెడీ అవుతున్నారు.

తాజాగా ఆయన కొత్త మేకోవర్‌లో కనిపించారు. బహుశా ప్రశాంత్‌ నీల్‌ సినిమా(NTR31) లుక్‌ ఇలానే ఉంటుందా? అనే డౌట్‌ వస్తుంది. అయితే సినిమాని ప్రకటించినప్పుడు విడుదల చేసిన లుక్‌లో ఎన్టీఆర్‌ పెద్ద మీసాలు, గెడ్డంతో ఉన్నారు. మున్ముందు ఈ లుక్‌పై క్లారిటీ రానుంది. 

Read more:పవన్‌ కళ్యాణ్‌, సౌందర్య చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా? ఎలా మిస్‌ అయ్యింది? పవన్‌ భయపడ్డాడా?

Also read: పెళ్లికి ముందే ఐశ్వర్యా రాయ్‌ కొడుకుని కన్నదా?, విడాకుల వార్తల నేపథ్యంలో షాకింగ్‌ విషయం బయటకు

Latest Videos

click me!