కమల్ హాసన్ చెంప పగలగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎందుకు అలా చేసిందంటే..?

Published : Oct 12, 2024, 09:19 PM IST

ఇండియన్ స్టార్ హీరో.. లోకనాయకుడు కమల్ హాసన్ ను ఓ హీరోయిన్ చెంప పగలగొట్టిందని మీకు తెలుసా..? ఈవిషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆ హీరోయిన్.. దానికి కారణం ఏంటో కూడా తెలిపింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?   

PREV
15
కమల్ హాసన్ చెంప పగలగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎందుకు అలా చేసిందంటే..?

లోకనాయకుడు కమల్ హాసన్  ప్రయోగాలు పెట్టింది పేరుగా నిలిచారు కమల్. ఇండియన్ సినిమాలో ఎక్స్ పెర్మెంట్స్ స్టార్ట్ చేసింది కమల్ హాసన్. అందులో సక్సెస్ అయ్యింది కూడా ఆయనే. దశావతారం లాంటి అద్బుతాలను ఆయన మాత్రమే సాధించగలిగారు. కమల్ హాసన్ ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగల నటుడు.

Also Read: సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్, ఏ హీరో క్రాస్ చేయలేని ఘనత ఏంటంటే..? 
 

25

యాక్షన్ హీరోగా రాణించిన కమల్, 'కల్కి 2898'లో పవర్ ఫుల్  విలన్‌గా నటించారు. ఈ పాత్రకు మంచి ఆదరణ కూడా  లభించింది. అంతే కాదు ఈసినిమాకు భారీగా పారితోషికం కూడా తీసుకున్నాడట కమల్. దాదాపు 50 ఏళ్లుగా సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా  కొనసాగుతున్నాడు కమల్ హాసన్.  

Also Read:  మహేష్ బాబు ఫారెన్ టూర్లపై ఎన్టీఆర్ సెటైర్లు..

35
Kamal Haasan

తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన సినిమాలు.. సినిమాల్లో సాహసాలు ఎవరు చేసి ఉండరు. సాగరసంగమం, స్వాతిముత్యం, విచిత్ర సహోదరులు, పంచతంత్రం, దశావతారం, విశ్వరూపం, ఇలా చెప్పుకుంటూవెళ్తే.. ఎన్నో మరెన్నో. అయితే తాజాగా కమల్ హాసన్ కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

45

అది ఏంటంటే..? కమల్ హాసన్ ను ఓ హీరోయిన్ చెంపమీద గట్టిగా కొట్టిందట. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమని. ఆమని జంటగా కమల్ హాసన్ తెలుగు సినిమా ఒకటి చేశారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమానే శుభసంకల్పం. 

ఈమూవీ చాలా నేచురల్ గా ఉంటుంది. విశ్వనాథ్ సినిమాల గురించి తెలిసిందే కాదా.. ఏదైనా రియలిస్టిక్ గా ఉండాలి అనుకుంటారు. కమల్ హాసన్ విశ్వనాథ్ డైరెక్షన్ లో రెండు మూడు సినిమాలు చేశారు. అందులో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో ఒక సీన్ లో కమల్ హాసన్ ను ఆమని చెంపదెబ్బ కొట్టాలి. కొట్టడం అంటే కొట్టేయడం కాదు.. కొట్టినట్టు నటించాలి. అయితే ముందుగా ఏసీన్ అయినా.. రిహార్సల్ ఉంటుందట. అందులో బాగంగా ఆమని రిహార్సల్ చేసింది. 

55

ఇక సీన్ రాగానే కమల్ చెంపమీద గట్టిగా కొట్టేసిందట. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్. ఇక ఆతరువాత కమల్ హాసన్ వచ్చి.. ఏంటమ్మా ఇది. కొట్టడం అంటే కొట్టేయడం కాదు.. కొట్టినట్టు నటించాలి అని చెంప పట్టుకుని బాధపడుతూ చెప్పారట. అలా కమల్ హాసన్ ను గట్టిగా చెంపదెబ్బ కొట్టిన హీరోయిన్ గా నా పేరు అలా ఉండిపోయింది అన్నారు ఓతెలుగు ఇంటర్వ్యూలో ఆమని. 

ఇక ప్రస్తుంతం ఆమని క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉంది. కమల్ హాసన్ మాత్రం వరుస సినిమాలతో అదరగోడుతున్నారు. రీసెంట్ గా కల్కీ సినిమాలో విలన్ గా అద్భుతం చేశారు కమల్ హాసన్. ఇక ఆయన చాలా కాల తరువాత మణిరత్నం డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories