సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్, ఏ హీరో క్రాస్ చేయలేని ఘనత ఏంటంటే..?

First Published | Oct 12, 2024, 7:01 PM IST

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ఆయన పేరుమీద ఉన్న రికార్డ్ లు అన్నీ ఇన్నీ కావు.. అందులో కొన్ని కొంత మంది హీరోలు క్రాస్ చేయగలిగారు కాని... కృష్ణ సాధించిన  ఈ అరుదైన రికార్డ్ ను మాత్రంఇంత వరకూ ఎవరు బీట్ చేయలేదు.. చేయలేరు కూడా ఇంతకీ ఏంటా రికార్డ్. 
 

స‌ూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆయనదేవుడు. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఉన్నా కాని.. కృష్ణమాత్రమే ఇండస్ట్రీ దేవుడు అని కొలిచేవారు ఎంతో మంది ఉన్నారు. ఆయన వల్ల ఎన్నో సినిమా కుటుంబాలు బాగుబడ్డాయి.

ఎంతో మంది వీధిన పడకుండా కృష్ణ కాపాడారు. దివాళ తీసిన నిర్మాతలకు డేట్లు ఇచ్చి.. వారిని నిలబెట్టిన దేవుడు. రెమ్యునరేషన్ కూడా పెద్దగా లెక్క చేయకుండా సినిమాలు చేసిన మంచి మనసున్న హీరో కృష్ణ. 

విజయ్ రాజకీయాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీకి నష్టం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరు..?

ఆయన సినిమాలు ఎలా చేసేవారంటే రోజుకు మూడు షిప్ట్ లు పనిచేసేవారు. ఏడాదికి 15 పైగా సినిమాలు రిలీజ్ చేసిన రికార్డ్ కూడా కృష్ణ పేరుమీద ఉంది. ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చేవారనో ఎప్పుడు వెళ్ళేవారో కూడా తెలియదు. కొందరు అయితే కృష్ణ ఇంట్లో నైట్ నిద్రపోయే సన్నివేశాలు కూడా షూట్ చేసుకుని వెళ్ళినవారు ఉన్నారట. అలా సినిమాల కోసం రేయింబవళ్ళు కష్టపడ్డ హీరో కృష్ణ. 

మహేష్ బాబు ఫారెన్ టూర్లపై ఎన్టీఆర్ సెటైర్లు..
 


ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణ సాధించిన రికార్డు లు ఎన్నో.. తెలుగులో ఫస్ట్ కలర్ సినిమా ఆయనదే, ఫస్ట్ తెలుగు కౌబాయ్ సినిమా కూడా ఆయనదే. డూప్ లేకుండా స్ట్రంట్స్ చేసిన మొదటి హీరో కూడా ఆయనే.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. ఎన్నో రికార్డ్ లు ఆయన ఖాతాలో ఉంటాయి. అందుకే కాబోలు అన్నీ చూసిన మహేష్ బాబు తన తండ్రిలా కాకుండా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. మిగతా రోజులు కుటంబానికి కేటాయించి..ఫారెన్ ట్రిప్పులు వేస్తుంటాడు. 

ఐశ్వర్య రాయ్ కి వింత వ్యాధి, అందుకే అలా అయిపోయిందా..?
 

అయితే కృష్ణ పేరు మీద ఉన్న ఓ రికార్డ్ ను మాత్రం ఇంత వరకూ ఎవరు సాధించలేకపోయారని మీకు తెలుసా.. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే..? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ట్రిపుల్ రోల్ సినిమాలు కూడా ఉన్నాయి కాని అవి కాస్త తక్కువగా ఉన్నాయి అనుకోవచ్చు.  

సూపర్‌ స్టార్‌ కృష్ణ అరుదైన ఫోటోలు(బర్త్ డే స్పెషల్‌).

బాలయ్య అధికనాయకుడు, చిరంజీవి ముగ్గరు మొనగాళ్ళు.. ఎన్టీఆర్ జైలవకుష లాంటి మూవీస్ ను ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ట్రిపుల్ రోల్స్ సినిమాలలో నటించిన హీరోగా చెరిపివేయలేని రికార్డు లను  కృష్ణ సాధించారని మీకు తెలుసా..?  అవును సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఏడు సినిమాలలో ట్రిపుల్ రోల్స్ లో నటించి మెప్పించారు. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని చెప్పవచ్చు. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కొంతమంది హీరోలు డ్యూయల్ రోల్ లో నటించలేదు. మరోవైపు స్టార్ హీరోలు రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం  టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా

ట్రిపుల్ రోల్స్ సినిమాలపై దర్శకులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ట్రిపుల్ రోల్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు కూడా లేవు. 

వంద కోట్లు.. రెండు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న మన తెలుగు హీరోలు.. సినిమాల్లో సక్సెస్ ఛాన్స్ లేని ట్రిపుల్ రోల్ వైపు చూస్తారని అనుకోలేం. ట్రిపుల్ రోల్స్ అంటే  రిస్క్ అని కొంతమంది హీరోలు ఈ తరహా ప్రాజెక్ట్ లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

Latest Videos

click me!