తాజాగా నాగ మణికంఠకు సంబంధించిన ఓ ప్రైవేట్ మేటర్ వెలుగులోకి వచ్చింది. అది భార్య ప్రియ రాసిన లేఖ వలన బహిర్గతమైంది. హౌస్లో ఉన్న నాగ మణికంఠకు భార్య ప్రియ పంపిన లెటర్ లో జూనియర్ అని సంబోధించింది. జూనియర్ ఏంటని... తోటి కంటెస్టెంట్స్ నాగ మణికంఠను ప్రశ్నించారు. నువ్వు, ప్రియ ఒక కాలేజ్ లో చదివారా? అనే సందేహం వ్యక్తం చేశారు.
కాదని చెప్పిన నాగ మణికంఠ... తన ఫోన్ లో కూడా నా నెంబర్ జూనియర్ అని సేవ్ చేసుకుందని అన్నాడు. నాగ మణికంఠను భార్య జూనియర్ అని పిలవడం వెనుక కారణం, అతడు ఆమె కంటే వయసులో చిన్నవాడు కావడమేనట. ప్రియ వయసులో నాగ మణికంఠ కంటే 3 ఏళ్ళు పెద్దది అట. నాగ మణికంఠ ఈ మేటర్ చెప్పడంతో గంగవ్వ షాక్ అయ్యింది.