భల్లాలదేవుడు పాత్రకు రానా కంటే ముందుగా అనుకున్న నటుడు ఎవరు..? రాజమౌళి చెప్పిన రహస్యం..

First Published | Aug 4, 2024, 7:33 PM IST

బాహుబలిలో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో.. రానాకు కూడా అంతే పేరు వచ్చింది. అయితే రానా నటించిన బల్లాల దేవుడు పాత్రకు ముందుగా  అనుకున్న నటుడు ఎవరోతెలుసా..? రానా కంటే ముందు ఈపాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో..? 

ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సినిమాలు..మరెన్నో పాత్రలు.. కొన్ని పాత్రలకు చాలామంది అద్భఉతంగా నటించి న్యాయం చేశారని పొగుడుతుంటాము. అటువంటి పాత్రవల్లే పాన్ ఇండియా స్టార్ గా మారాడు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి భల్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా నటించాడు. ప్రభాస్ కు ధీటుగా ఆయన నటించాడు. 
 

బహుబలిగా ప్రభాస్ కు ఎంత పేరువచ్చిందో.. భల్లాలదేవుడు పాత్రలో రానాకు  కూడా అంతే పేరు వచ్చింది. విలన్ గా రానాను చూసి ఔరా అనుకున్నారంతా..? అయితే  ఈ పాత్ర రానా కోసం డిజైన్ చేసింది కాదట. ఈ క్యారెక్టర కోసం ముందుగా రాజమౌళి వేరేవాళ్లను అనుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఆయనే వెళ్ళడించారు. ఇంతకీ ఈ పాత్రకోసం అనుకున్న నటుడు ఎవరు..? 


బాహుబలి బల్లాలదేవుడు పాత్రకోసం హాలీవుడ్ యాక్టర్..ఆక్వామెన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల ఫేమ్ జేసన్ మమోవా ను తీసుకోవాలి అని ముందుగా అనుకున్నాడట రాజమౌళి. ఈ  కథ ప్రకారం ప్రభాస్ కు ధీటుగా ఉండే కటౌట్ కావాలని అతడి పేరు ప్రస్తావించారు. అయితే.. అతను ఒప్పుకుంటాడో లేదో అనకున్న టైమ్ లో.. నిర్మాత శోభు రానా పేరును ప్రస్తావించాడట. 
 

రానా అయితే ఈ పాత్రకు బాగుంటాడు.. ప్రభాస్ కు ధీటుగా నటించగలడు.. ఆపోజిట్ పాత్రలో స్ట్రాంగ్ గా ఉంటాడు అని శోభు అన్నారట. అప్పుడు రానా కృష్ణం వందే జగద్గురుం చేస్తున్నాడు. ఆ టైమ్ లో వర్కింగ్ స్టిల్స్ చూసిన రాజమౌళి..  అవును బాగున్నాడు.. కాస్త బాడీ పెంచితే.. ఈ పాత్రకు ఇంకా బాగుంటాడు అని చెప్పి.. రానాను ఫిక్స చేశాడట. 
 

ఇక ఈ విషయం రానా స్యయంగా నిర్మాతను అడిగాడట. ఓరోజు ప్రభాస్ ను కలిసి నిర్మాత శోభు యార్లగడ్డ సినిమా, విలన్ పాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు.  ఈ పాత్ర కోసం ఇంకా ఎవరినైనా అనుకున్నారా అని రానా నిర్మాతను అడిగాడట. జేసన్ మమోవా ను పెడదాం అనుకున్నామని నిర్మాత చెప్పగానే.. నవ్వుకుని భల్లాల దేవుడు పాత్రకు ఓకే చెప్పారట రానా. ఆపై బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిన విషయమే.

Latest Videos

click me!