బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కథను రిజెక్ట్ చేసిన ప్రభాస్...? కారణం ఏంటి..?

ఇండియన్ స్టార్ హీరోలు సైతం  ఆదర్శకుడితో సినిమా చేయాలని కలలు కంటుంటారు. అంటుంటి డైరెక్టర్ చెప్పిన కథను ప్రభాస్ రిజెక్ట్ చేశాడట. కారణం ఏంటో తెలుసా..? ఇంతకీ ఎవరా దర్శకుడు..? ప్రభాస్ ఎందుకు రిజెక్ట్ చేశాడు..? 
 

ఇండియన్ స్టార్ హీరోల లిస్ట్ లో.. టాలీవుడ్ నుంచి చేరిన మొదటిపేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. ఆతరువాత వరుసగా మూడు ఫెయిల్యూర్స్ ను మూటగట్టుకున్నాడు. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గెలుపోటములు లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ కు హ్యాట్రిక్ ఫెయిల్ తరువాత సలర్ తో మంచి సక్సెస్ అందింది. సలర్ సినిమాతో ఊపిరి పీల్చుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. 

900 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తా.. భర్తకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

నాగ్ అశ్వీన్ డైరెక్ట్ చేసిన కల్కి సినిమా 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటి.. ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. బాహుబలి తరువాత ఇన్నేళ్లకు కల్కి సినిమాతో కరెక్ట్ గా కమ్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. ఈక్రమంలో ప్రభాస్ కు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. ప్రభాస్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. 
 

మహేష్ బాబు చీరకట్టి.. పూలు పెట్టుకున్న ఏకైక సినిమా..? అంత సాహసం ఎందుకు చేశాడు..?


అవును అది కూడా ఇప్పుడు కాదు.. బాహుబలి సినిమా చేసిన తరువాతే ఆయన ఈ పని చేశాడట ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే దర్శకుడు రాజ్ కుమార్ హీరాణి.  మున్నాభాయ్ ఎమ్ బీబీఎస్, పీకే,  త్రీ ఇడియట్స్, సంజు లాంటి అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్  తో సినిమా చేయాలి అని అనుకున్నాడట. 

ఓ అద్భుతమైన కథను కూడా ప్రభాస్ కు వినిపించాడట రాజ్ కుమార్. అయితే.. ఆర్ట్ మూవీస్ ను తెరకెక్కించే రాజ్ కుమార్.. ప్రభాస్ కు కూడా అలాంటి కథనే వినిపించాడ. కథ బాగుంది కాని.. ఇంత సాప్ట్ స్టోరీ తనకు సెట్ అవ్వదేమో అని భావించాడట రెబల్ స్టార్.  ఈ స్టోరీ నాకు సెట్ అవుతుందో లేదో తెలియదు.. యాక్షన్ స్టోరీ ఉంటే చూడండి అని రాజ్ కుమార్ తో అన్నాడట ప్రభాస్. దాంతో ఈ సినిమా అక్కడ ఆగిపోయింది. 
 

మరి ప్రభాస్ కోసం యాక్షన్ స్టోరీని రాజ్ కుమార్ రెడీ చేస్తాడా..? లేక ఆయన రూట్ లోనే ఆయన వెళ్ళిపోతారా అనేది తెలియాల్సి ఉంది.  ఇలా ప్రభాస్ రాజ్ కుమార్ హీరాణి డైరెక్షన్ లో  నటించడం మిస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి.

సలార్ 2 తో పాటు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లోమరో సినిమా కమిట్ అయ్యాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు లైన్ చేశాడని సమాచారం. 

Latest Videos

click me!