
మెగాస్టార్ చిరంజీవి చాలా కింది స్థాయి నుంచి సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. ప్రారంభంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వాటిని భరించాడు. తన ప్రతిభతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగారు. తాను ప్రారంభ దశలోనే ఈగోకి పోయి, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకాబట్టే, ఆయన మెగాస్టార్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే చిరంజీవిని చూసి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. హీరోలు అయ్యారు, దర్శకులు అయ్యారు. నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ ఓ హీరో మాత్రం భయపడ్డాడు. చిరుని చూసి ఏకంగా సినిమా ఇండస్ట్రీనే వదిలేద్దామనుకున్నాడు. అంతగా చిరంజీవిని చూసి భయపడ్డ హీరో ఎవరో కాదు మన్మథుడు నాగార్జున. ఆయన చిరుని మొదటిసారి చూసి టెన్షన్ బడ్డాడట. అన్నపూర్ణ స్టూడియో సెట్‌లో అలా చూసి ఇక మన వల్ల కాదు, ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నాడట. స్వయంగా నాగార్జుననే ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఆ సందర్భం ఏంటి? నాగార్జున ఎందుకు అలా అనుకున్నాడు? చిరంజీవి ఏం చేశాడనేది చూస్తే.
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే మొదట వ్యాపారం చేయాలనుకున్నాడట. అందుకే ఫారెన్‌లో చదువుకున్నాడు. కానీ సడెన్‌గా దృష్టి సినిమాలవైపు మళ్లింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లోనే సినిమాలు చేస్తున్నారు. హీరో కావాలి. ఎవరో ఎందుకు మన నాగార్జుననే ఉన్నాడు కదా అని అన్న వెంకట్ భావించారు. అదే విషయాన్ని నాగ్‌కి చెప్పగా, తన ఆసక్తిని వెల్లడించారు. దీంతో ఆ విషయాన్ని ఏఎన్నార్‌కి నెమ్మదిగా చెప్పారు నాగ్. ఆ సమయంలో నాగ్ అన్నమాటలకు ఏఎన్నార్ ఎమోషనల్ అయ్యారట. మనసులో ఆయనకు కూడా ఇదే ఉంది, కానీ నాగార్జున ఇష్టం ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాగార్జునే ఇలా సినిమాల్లోకి వస్తానని చెప్పడంతో ఏఎన్నార్ మనుసులో ఆనందపడ్డారు.
అయితే నాగార్జునకు ఆ సమయంలోనే క్లారిటీ ఇచ్చాడు ఏఎన్నార్. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా నిన్ను అభిమానిస్తారు. కానీ ఆదరించడం వేరు, సినిమాల్లో రాణించడం వేరు, ఏఎన్నారు కొడుకు కదా, హీరో అయిపోవచ్చు అనుకుంటే పొరపాటే, యాక్టింగ్‌తో నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. అదే మాటతో నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు నాగార్జున. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నాగార్జున.. తండ్రితోపాటు షూటింగ్‌లు తిరిగేవాడట. అలా ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లినప్పుడు అందులోనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది. చిరు, రాధాలపై వాన సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎన్నార్ ఉండి, పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది, వెళ్లి చూడు, డాన్సులు నేర్చుకో అని నాగ్‌కి చెప్పారు ఏఎన్నార్.
దీంతో నాగార్జున వెళ్లి ఆ షూటింగ్ చూశాడు. చిరంజీవి డాన్సులు చూసి షాక్ అయ్యాడట మన్మథుడు. ఆయనలా తాను డాన్సులు చేయగలనా అని గుబులు పట్టుకుందట. ఇలా డాన్సులు మనం చేయలేం, వద్దులే వేరే దోవ వెతుక్కుందాం అని బయటకు వచ్చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఏఎన్నార్ జాతీయ అవార్డుని అమితాబ్ బచ్చన్‌కి ప్రదానం చేసిన సందర్భంగా నాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు అలా భయపడ్డ నాగార్జున `విక్రమ్` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నెమ్మదిగా హీరోగా రాణించారు. ఇప్పుడు సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు డిఫరెంట్స్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న విషయం తెలిసిందే.