విజయ్ దళపతి చివరి సినిమా జన నాయగన్ ఫస్ట్ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?

Published : Sep 16, 2025, 04:06 PM IST

విజయ్ దళపతి  హీరోగా నటించిన 'చివరి సినిమా  జన నాయగన్. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉండగా  జన నాయగన్  సినిమా మొదటి రివ్యూను ఓ ప్రముఖుడు విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? 

PREV
14
జన నాయగన్ ఫస్ట్ రివ్యూ

విజయ్ దళపతి హీరోగా నటించిన చివరి సినిమా 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ఓ ప్రముఖుడు మొదటి రివ్యూ ఇచ్చారు.

24
విజయిజం కనిపిస్తుంది

విజయ్ 'జన నాయగన్' గురించి ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్ చెప్పిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. సినిమా అద్భుతంగా వచ్చిందని, 100 శాతం 'విజయిజం' ఉందని ఆయన అన్నారు. ఇది ఫ్యాన్స్‌కు  మర్చిపోలేని  ట్రీట్  అవుతుందని తెలుస్తోంది.

34
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు?

ఈ సినిమాలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి లాంటి భారీ తారాగణం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. లోకేష్, అట్లీ, నెల్సన్ ఒక పాటలో కనిపిస్తారని టాక్. ఇక జననాయగన్ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది.

44
1000 కోట్ల వసూళ్లు టార్గెట్

ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసి విజయ్‌కు గ్రాండ్ సెండాఫ్ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. హెచ్. వినోద్ అన్ని ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తారని అంచనా. విజయ్ 'ది గోట్' రూ.456 కోట్లు వసూలు చేసింది. మరి ఈసినిమా వెయ్యి కోట్లు వసూలు చేసి, కోలీవుడ్ కోరిక తీర్చుతుందా లేదా అనేది చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories