ఖలేజా ఫ్లాప్ అంటే గొడవ, ఎన్టీఆర్ చెప్పినట్లు ఆయన అరుదైన మనిషి.. విజయ్ దేవరకొండ, హైపర్ ఆది కామెంట్స్ వైరల్

First Published | Oct 28, 2024, 3:15 PM IST

విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా ఒక హంగామా ఉంటుంది. బుల్లితెరపై సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తున్న హైపర్ ఆది మైక్ పట్టుకుంటే ప్రాసలు ఎలా చెబుతాడో కూడా తెలుసు. వీళ్ళిద్దరూ కలసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని పొగిడితే భలే గమ్మత్తుగా ఉంటుంది.

విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా ఒక హంగామా ఉంటుంది. బుల్లితెరపై సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తున్న హైపర్ ఆది మైక్ పట్టుకుంటే ప్రాసలు ఎలా చెబుతాడో కూడా తెలుసు. వీళ్ళిద్దరూ కలసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని పొగిడితే భలే గమ్మత్తుగా ఉంటుంది. రీసెంట్ గా జరిగిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ అతిథితులుగా హాజరయ్యారు. 

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెళ్లి చూపులు తర్వాత నా ఫస్ట్ చెక్ త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. అతడు, ఖలేజా చిత్రాలు నాకు చాలా ఇష్టం. ఖలేజా ఎవరన్నా ఫ్లాప్ అంటే నేను వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడిని అని విజయ్ దేవరకొండ తెలిపారు. 


Vijay Devarakonda

హైపర్ ఆది మరోసారి తన ప్రాసల ప్రవాహం కొనసాగించాడు. నాగార్జునకి శివ మూవీ లాగా.. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి చిత్రం. ఎక్కడో వెనుక నిలబడి క్యారెక్టర్స్ చేసే స్థాయి నుంచి తన వెనుక లక్షల మంది అభిమానులు ఉండే స్థాయిలో విజయ్ దేవరకొండ చేరుకున్నారు అని హైపర్ ఆది ప్రశంసించారు. తెలుగు సినిమా రైటింగ్ గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ కి ముందు త్రివిక్రమ్ తర్వాత అని చెప్పొచ్చు. నా ల్యాప్ టాప్ లో త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గారి గురించి చెప్పిన మాటలు, నువ్వే నువ్వే చిత్రం మాత్రమే ఉండేవి అంటూ ఆది ప్రశంసలు కురిపించారు. 

త్రివిక్రమ్ రాసిన అనేక డైలాగ్స్ ని ఉదాహరణగా చెప్పాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు త్రివిక్రమ్ ఒక అరుదైన మనిషి అని తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారికి కష్టాల్లో అభిమానులతో పాటు త్రివిక్రమ్ గారు కూడా ఒక స్నేహితుడిగా అండగా ఉన్నారని హైపర్ ఆది అభినందించారు. ప్రస్తుతం హైపర్ ఆది, విజయ్ దేవరకొండ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!