Pushpa Movie : 'పుష్ప'కి పెద్ద మైనస్ అదే.. తొందరపడ్డారా?

First Published Dec 18, 2021, 2:17 PM IST

ఐకాన్ స్టార్ Allu Arjun ప్రాణం పెట్టి చేసిన చిత్రం పుష్ప. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. అల్లు అర్జున్ మునుపెన్నడూ లేనివిధంగా విభిన్నమైన గెటప్ లో కనిపించడం, ఎర్రచందనం స్మగ్లర్ గా ఈ చిత్రంలో నటించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఐకాన్ స్టార్ Allu Arjun ప్రాణం పెట్టి చేసిన చిత్రం పుష్ప. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. అల్లు అర్జున్ మునుపెన్నడూ లేనివిధంగా విభిన్నమైన గెటప్ లో కనిపించడం, ఎర్రచందనం స్మగ్లర్ గా ఈ చిత్రంలో నటించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందుకు తగ్గట్లుగానే పుష్ప చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, పాటలు సినిమాపై హైప్ పెంచుతూ వచ్చాయి. 

భారీ అంచనాల నడుమ Pushpa The Rise మొదటి భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ సినిమాని తన భుజాలపై మోస్తూ ప్రతి సన్నివేశంలో అదరగొట్టాడు. అన్ని రకాల వేరియేషన్స్ పండించాడు. చిత్తూరు స్లాంగ్ లో బన్నీ డైలాగులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ పుష్ప చిత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి కొన్ని కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా రన్ టైం ఎక్కువగా ఉంది. డిసెంబర్ 17నే రిలీజ్ అనుకుని హడావిడిగా రిలీజ్ చేశారు. దీనితో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సరైన టైం దొరకలేదు. విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వీక్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సినిమాకు పెద్ద మైనస్ గా మారిన అంశం రీరికార్డింగ్. 

చాలా సన్నివేశాల్లో, డైలాగుల్లో సౌండ్ సరిగ్గా మిక్స్ కాలేదు. కొన్ని సన్నివేశాల్లో ఇది కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. బన్నీ హీరోయిజంని ఎలివేట్ చేసేందుకు ఎంత చేయాలో సుక్కు అంత చేశాడు. కానీ ఆ సన్నివేశాలకు దేవిశ్రీ అందించిన బిజియం వర్కౌట్ కాలేదు. ఇది ప్రేక్షకులకు నిరాశగా మారింది. అలాగే సమంత ఐటెం సాంగ్ లిరికల్ వీడియో రికార్డులు సృష్టించింది. కానీ థియేటర్స్ లో విజువల్స్ పరంగా ఆకట్టుకోలేదు. 

రీరికార్డింగ్ కి టైం తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే బావుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు బిజియం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి అభిమానులకు గూస్ బంప్స్ కల్గించేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండాలి. 

ఇటీవల విడుదలైన బాలయ్య అఖండ చిత్రం అంత పెద్ద విజయం సాధించింది అంటే తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ముఖ్యమైన కారణం. సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో దేవిశ్రీ అదిరిపోయే బిజియం ఇచ్చాడు. కానీ పుష్పలో అది వర్కౌట్ కాలేదని అంటున్నారు. కనీసం సుకుమార్ ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. టైం తక్కువగా ఉంది అని సుక్కు తనతో అన్నట్లు రాజమౌళి తెలిపారు. పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత హడావిడిగా పనిచేశారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. Also Read: Anasuya : వామ్మో..ఆ మూవీలో అనసూయ విధ్వంసం.. పరువాలతో బెడ్ పై రెచ్చిపోయిన యాంకర్

Also Read: ఈ మనిషి ఈగ తోనే అంత చేశాడు, పైకి లేచి క్లాప్స్ కొట్టా.. రాజమౌళిపై కరణ్ జోహార్ కామెంట్స్

click me!