చివరి రెండు చిత్రాలు ‘బంగార్రాజు’,‘లవ్ స్టోరీ’ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న చైతూకూ.. ఆ తర్వాత వచ్చిన ‘థ్యాంక్యూ’,‘లాల్ సింగ్ చడ్డా’ ఆశించిన ఫలితానివ్వలేక పోయాయి. దీంతో నాగచైతన్య నెక్ట్స్ ప్రాజెక్ట్ లను మరింత జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ పెట్లతో అని వార్తలు వచ్చినా తేలిపోయాయి. ప్రస్తుతం తమిళ సింగర్, ప్రొడ్యూసర్, దర్శకుడు వెకంట్ ప్రభు డైరెక్షనల్ లో ఓ చిత్రం ఒకే అయినట్టు తెలుస్తోంది. ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.