ప్రైవేట్ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి... ఇద్దరి మధ్య ఎఫైర్ వార్తల నేపథ్యంలో కీలక పరిణామం!

Published : Aug 17, 2022, 05:40 PM IST

ఒకే పార్టీలో కలిసి పాల్గొన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరోసారి వార్తలకెక్కారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో తాజా సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. లావణ్య, వరుణ్ తేజ్ పార్టీలో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
16
ప్రైవేట్ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి... ఇద్దరి మధ్య ఎఫైర్ వార్తల నేపథ్యంలో కీలక పరిణామం!
Varun Tej- Lavanya Tripathi

చాలా కాలంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఏకంగా పెళ్ళికి సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. బెంగుళూరులో ఉన్న లావణ్యను వరుణ్ తేజ్ వెడ్డింగ్ రింగ్ తీసుకొని కలవవడానికి వెళ్లాడని, పెళ్లి ప్రకటన రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది.

26
Varun Tej- Lavanya Tripathi

అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఖండించారు. జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. తాజాగా లావణ్య, వరుణ్ తేజ్ కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది. కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో వరుణ్ తేజ్, లావణ్యతో పాటు ధరమ్ తేజ్, నితిన్ భార్య షాలిని కూడా పాల్గొన్నట్లు సమాచారం. 
 

36
Varun Tej- Lavanya Tripathi

ఇక వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వాదన ఉంది. ఏదో ఒకరోజు లావణ్య, వరుణ్ పెళ్లి ప్రకటన చేసే అవకాశం కలదు.

46
Varun Tej- Lavanya Tripathi

వరుణ్ చెల్లెలు నిహారిక వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు బంధులు మాత్రమే హాజరయ్యారు. పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం లేదు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం నిహారిక పెళ్ళికి హాజరయ్యారు. ఈ సంఘటన కూడా లావణ్య, వరుణ్ లవ్ రూమర్స్ కి కారణమైంది.

56
Varun Tej- Lavanya Tripathi

మరోవైపు లావణ్య కెరీర్ నెమ్మదించింది. వరుస ప్లాప్స్ తో ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరారు. లావణ్య లేటెస్ట్ మూవీ హ్యాపీ బర్త్ డే సైతం విజయం అందుకోలేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు

66

అలాగే వరుణ్ కూడా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కష్టపడి చేసిన గని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎఫ్ 3 సైతం నిరాశపరిచింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. నెక్స్ట్ ఆయన గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.

click me!

Recommended Stories