తన కొడుకు డెబ్యూ కోసం 2 ఏళ్ళు ఎదురుచూసి చివరికి పూరీని నమ్ముకున్న లెజెండ్రీ హీరో, చిరంజీవి కాదు..రజనీ ఫిదా 

Published : Mar 24, 2025, 02:16 PM IST

లెజెండ్రీ హీరో ఒకరు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసేందుకు 2 ఏళ్ళు ఎదురుచూశారు. చివరికి తన తనయుడి డెబ్యూ చిత్రానికి డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కరెక్ట్ అని భావించారు. ఆ లెజెండ్రీ హీరో ఎవరు, ఆయన కొడుకు ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
తన కొడుకు డెబ్యూ కోసం 2 ఏళ్ళు ఎదురుచూసి చివరికి పూరీని నమ్ముకున్న లెజెండ్రీ హీరో, చిరంజీవి కాదు..రజనీ ఫిదా 
Puri Jagannadh

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం వరుసగా ఫ్లాపుల కారణంగా కెరీర్ లో వెనుకబడ్డారు. కానీ ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అంచనాలు ఉండేవి. ఒక్క ప్రభాస్ కి తప్ప పూరి జగన్నాధ్ తనతో వర్క్ చేసిన స్టార్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. పూరి జగన్నాధ్ ఇండస్ట్రీకి వచ్చిన టైంలో పాన్ ఇండియా చిత్రాలు లేవు. 

25
Puri Jagannadh, Puneeth Rajkumar

కానీ అప్పట్లోనే పూరి క్రేజ్ పక్క రాష్ట్రాలకు పాకింది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన బాచి చిత్రం తెలుగులో డిసాస్టర్ అయింది. కర్ణాటకలో ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పూరి జగన్నాధ్ ట్యాలెంట్ ని గుర్తించారు. వెంటనే పిలిపించి సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ విధంగా శివరాజ్ కుమార్, పూరి కాంబోలో యువరాజా చిత్రం తెరకెక్కింది. ఇది పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' చిత్రానికి రీమేక్. యువరాజ మూవీ సూపర్ హిట్ కావడంతో కన్నడనాట పూరి పేరు బలంగా వినిపించింది. 

35
Puri Jagannadh

శివరాజ్ కుమార్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తన చిన్న కొడుకు పునీత్ ని లాంచ్ చేయడం కోసం 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. పూరి ట్యాలెంట్ గురించి రాజ్ కుమార్ కి కూడా తెలిసింది. దీనితో పూరీని పిలిపించి పునీత్ ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారట. రాజ్ కుమార్ లెజెండ్రీ నటుడు కావడంతో, ఆయనే స్వయంగా తన కొడుకుని లాంచ్ చేయమని అడగడంతో పూరి భయం భయంగా ఒప్పుకున్నారట. 

45
Puri Jagannadh

అప్పటికే పూరి జగన్నాధ్ ఇడియట్ కథ రెడీ చేసుకుని ఉన్నారు. అయితే పూరి ఈ కథ రాసుకుని పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కోసం. పునీత్ ని లాంచ్ చేసే బాధ్యత తనపై ఉండడంతో ఆ కథని పునీత్ కోసం మార్చారు. పూరి జగన్నాధ్ ఇడియట్ అనే టైటిల్ చెప్పారట. ఆ టైటిల్ వద్దు అప్పు అని పెట్టమని పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ సలహా ఇచ్చారట. ఆ విధంగా పునీత్, పూరి కాంబోలో అప్పు చిత్రం తెరకెక్కి సంచలన విజయం సాధించింది. తన కొడుకు తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రాజ్ కుమార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పు 100 రోజుల వేడుకకి రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పు చిత్రం చూసి పూరి జగన్నాధ్ దర్శకత్వంకి సూపర్ స్టార్ ఫిదా అయ్యారట. 

55
Puri Jagannadh

అదే కథని పూరి తెలుగులో ఇడియట్ టైటిల్ తో రవితేజ హీరోగా తెరకెక్కించారు. ఆ మూవీ రవితేజని ఓవర్ నైట్ లో స్టార్ గా మార్చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ని కూడా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసిన ఘనత పూరి జగన్నాధ్ కే దక్కింది. 

 

Read more Photos on
click me!

Recommended Stories