తమ చదువుల కోసం నాన్నని వదిలేసి ఒంటరిగానే హైదరాబాద్ వచ్చిందని, ఇక్కడ పని చేస్తూ తమని చదివించిందని తెలిపింది తనూజ. కొన్నాళ్లపాటు ఎవరికీ తెలియకుండా ఇక్కడే పెరిగామని, ఆ తర్వాత తమ గురించి తెలుసుకుని, ఫ్యామిలీలో అందరిని ఒప్పించి నాన్న ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది. అంతేకాదు, చాలా విషయాలు తన వల్ల కాదని అనుకున్నప్పుడు నువ్వు చేయగలవు అని ధైర్యాన్నిచ్చి, చేసేలా ప్రోత్సహించిందని, తనవెంటే నిలబడిందని, తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే దానికి అమ్మనే కారణం అని చెప్పింది. తన జీవితంలో అమ్మనే హీరో అంటూ `నా సావిత్రినే నా హీరో` అని తెలిపింది తనూజ. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి గురయ్యింది.