Thanuja: పవన్‌ సాయితో రిలేషన్‌ని బయటపెట్టిన తనూజ.. మరో జన్మ ఉంటే ఆయనలా పుట్టాలనుకుంటా

Published : Jan 03, 2026, 04:50 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న తనూజ తన రిలేషన్‌పై ఓపెన్‌ అయ్యింది. నటుడు పవన్‌ సాయితో ఉన్న బాండింగ్‌ని బయటపెట్టింది. పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. 

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 9 లో రన్నరప్‌గా నిలిచిన తనూజ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో పాపులర్‌ అయ్యింది తనూజ. సీరియల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి తనదైన గేమ్‌తో ఆకట్టుకుంటూ వచ్చింది. అందరిలో కెళ్ల కాస్త మెచ్యూరిటీగా ఉంటూ మెప్పించింది. అదే సమయంలో టాస్క్ ల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. మరోవైపు భరణిని నాన్న అని పిలుస్తూ సెంటిమెంట్‌ని పలికించింది. మొత్తంగా కప్‌ గెలుచుకునేందుకు చివరి అంచు వరకు వెళ్లింది. రన్నరప్‌గా మిగిలిపోయింది.

26
కళ్యాణ్‌తో తనూజ రిలేషన్‌

అయితే బిగ్‌ బాస్‌ షోలో ఆమె కళ్యాణ్‌ పడాల విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్‌ చూపించింది. ఆయనపై తెలియని ఇంట్రెస్ట్ ని చూపించింది. కళ్యాణ్‌ కూడా ఆమె విషయంలో ఇంట్రెస్ట్ గా కనిపించాడు. ఛాన్స్ దొరికితే పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. అంతేకాదు షో అయిపోయాక తన గెలుపు క్రెడిట్‌ తనూజకే ఇచ్చాడు. ఆమె వల్లే తాను ధైర్యంగా ఉండగలిగాను, చాలా మారగలిగాను అని తెలిపాడు. అయితే షోలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య క్రష్‌ నడిచిందనే టాక్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఇంకా ఏదో ఉందనే విషయం చర్చనీయాంశమైంది. కానీ మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని ఈ ఇద్దరు బయటకు ప్రొజెక్ట్ చేశారు.

36
పవన్‌ సాయితో రిలేషన్‌పై తనూజ కామెంట్‌

ఈ క్రమంలో ఇప్పుడు తనూజకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. నటుడు పవన్‌ సాయితో తనూజ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. తనూజ, సాయి కలిసి `ముద్దమందారం` సీరియల్‌లో నటించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. రియల్‌ కపుల్ అనేంతగా ఈ ఇద్దరు తమ బాండింగ్‌ని చూపించారు. దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్‌పై పలు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తనూజ దీనిపై స్పందించింది. తమ రిలేషన్‌ ఎలాంటిదో తెలిపింది. తన ఫ్యామిలీ తర్వాత ఇంపార్టెంట్‌ పర్సన్‌ అంటే పవన్ అని చెప్పింది.

46
తనూజ కేర్‌ టేకర్‌ పవన్‌ సాయి

తనూజ మాట్లాడుతూ, తనని తన ఫ్యామిలీ తర్వాత అంతగా పట్టించుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ సాయి అని, వ్యక్తిగత విషయాల్లోనే కాదు, ప్రొఫెషనల్‌ విషయాల్లోనూ ఆయన ప్రమేయం ఉంటుందని చెప్పింది తనూజ. తనకు ఏదైనా ఆఫర్‌ వస్తే, అది చేయాలా? వద్దా అనేది ఫ్యామిలీతో మాట్లాడుతుంటే, ఒకసారి పవన్‌కి ఫోన్‌ చేయు అని అమ్మ చెబుతుంది. అమ్మమ్మ కూడా పవన్‌ని అడుగు, ఏమంటాడో కనుక్కో అని చెబుతుంది. అంతగా తన ఫ్యామిలీలో పవన్‌ కలిసిపోయాడని చెప్పింది తనూజ. ఏదైనా డిస్కస్‌ చేయాలంటే ఫస్ట్ పర్సన్‌ సాయినే అని స్పష్టం చేసింది.

56
మరో జన్మంటూ ఉంటే పవన్‌లా పుట్టాలనుకుంటా

``పవన్ లాంటి వ్యక్తిని మనం చాలా రేర్‌గా చూస్తాం, పవన్ తో నేను తమిళ్‌లో, తెలుగులో కూడా కలిసి వర్క్ చేశాను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్‌గా ఉంటారు. ఎంత సీరియస్ సందర్భం అయినా స్మైల్‌తోనే మ్యానేజ్ చేస్తారు. చాలా కూల్ పర్సన్. పిడుగు వచ్చి మీద పడ్డా కూడా కూల్‌గా ఉంటారు. టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అని కూల్ చేసేస్తుంటారు. చాలా పాజిటివ్ పర్సన్. చాలా బాగా మోటివేట్ చేస్తారు. ప్రతి విషయాన్ని ఎంత కూల్‌గా చెప్తారంటే.. మనకి కోపం వస్తే మన ఎక్స్ ప్రెషన్ మారిపోతుంది. బిహేవియర్ మారిపోతుంది. కానీ ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆనందం అయినా బాధ మొహంపై చిరునవ్వు చెరిగిపోదు. నేను ఆయన్ని చాలాసార్లు అడిగాను. మీరు ఇంత కూల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని. దానికి ఆయన `జరిగేది జరుగుతుంటుంది, దానికోసం వర్రీ ఎందుకు` అని అంటారు. ఎవరి గురించి నెగటివ్‌ గా మాట్లాడరు, ఎవరినీ బాధపెట్టరు. అలాంటి వ్యక్తిని భవిష్యత్‌లో కలుస్తానో లేదో తెలియదు, ఇంకో జన్మ అనేది ఉంటే అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్‌తో పుట్టాలని కోరుకుంటా` అని తెలిపింది తనూజ.

66
పెళ్లిపై తనూజ కామెంట్‌

పెళ్లి గురించి తనూజ ఓపెన్‌ అయ్యింది. ఆమె చెబుతూ, తన లైఫ్‌లో ఫేవరేట్‌ చాప్టర్‌ ఏదైనా ఉందంటే అది పెళ్లినే అని, తనకు పెళ్లి అంటే చాలా ఇష్టమని, ఆ క్షణం కోసం తానూ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా  అబ్బాయిల విషయంలో తన అమ్మమ్మ చెప్పిన విషయాన్ని పంచుకుంటూ, `ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, బాధ్యత గల వ్యక్తిగా నిలబడటానికైనా ఒక ఆడపిల్ల చేతిలోనే ఉంటుందట. అబ్బాయి ఫ్యూచర్ అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుంది. నేను అది బలంగా నమ్ముతున్నా. నన్ను పెళ్లి చేసుకునేవాడు అలా ఉండాలి. మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. గౌరవమైన లైఫ్‌ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నా వరకూ నేను హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలను. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే నా పార్టనర్‌ని డిసైడ్ చేస్తుంది` అని తెలిపింది తనూజ. మొత్తంగా పెళ్లిపై చాలా హోప్స్ పెట్టుకున్న తనూజ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది తనూజ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories