Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?

Published : Aug 15, 2024, 07:13 AM IST

సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు మరో పేరు విక్రమ్. గెలుపోటములు లెక్కచేయకుండా.. ప్రయోగాత్మకు సినిమాలు చేసుకుంటూ.. వెళ్ళే విక్రమ్.. ఈసారి మరో  అద్భుతమైన డీగ్లామర్ రోల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తంగలాన్ గా వచ్చిన విక్రమ్ సక్సెస్ సాధించాడా..? ఆయన సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు చూద్దాం. 

PREV
17
Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
Thangalaan

కబాలి', 'సార్పట్టాస లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ పా. రంజిత్. 'అప‌రిచితుడు', 'ఐ', 'శివ‌పుత్రుడు' లాంటి డిఫ‌రెంట్ సినిమాలు తీసిన చియాన్ విక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'తంగ‌లాన్'. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి కారణం విక్ర‌మ్ అన్నింటికంటే ఈసినిమాలో చాలా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌నున్నారు విక్రమ్. ఈరోజు ( అగస్టు 15) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న తంగలాన్ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ రివ్యూ ఏంటి.? ట్విట్టర్ లో ఏం చెపుతున్నారు.?  

27
Vikrams Thangalaan advance booking collection report out

చియాన్ విక్రమ్ అసాధారణమైన నటన, పాత్ర పట్ల అంకిత భావం ఎన్నో సార్లు రుజువు అయ్యింది. హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదని ఆయన చాలా సార్లు నిరూపించాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేశారు. అసలైన హీరోయిజం ఎంటో చూపించాడు. గ్లామర్ కాదు.. అతను చేసే పనిలో హీరోయిజం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక తంగలాన్ విక్రమ్  కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందంటున్నారు ఈసినిమా చూసిన నెటిజన్లు. ఆయ అద్బుతమైన నటనకు మంత్రముగ్ధులంఅయ్యామంటూ.. ఎక్స్ వేదికగా వెల్లడిస్తున్నారు. వరుసగా విక్రమ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

37
Chiyaan Vikram starrer new film Thangalaan update out

#Thangalaan హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సినిమా బాగా  ట్రెండ్ అవుతుండగా, అభిమానులు, సినిమా ప్రియులు విక్రమ్  నటనకు  ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఒక సినిమా పట్ల ఉనిబద్ధతను.. ప్రేమను ప్రస్థావిస్తూ ట్వీట్లు వేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానులు చియాన్ అని ముద్దుగా పిలుచుకునే విక్రమ్.. ఇంత గొప్ప నటుడు ఎలా అయ్యాడే అనేది తంగలాన్ మూవీ చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధం అవుతుంది అని ట్వీట్ చేస్తున్నారు. అంతే కాదు తంగలాన్ లో ఈ పాత్ర కోసం విక్రమ్ తను తాను ఫిజికల్ గా..మెంటల్ గా ఎంత ప్రిపేర్ అయ్యాడు.. ఎంత కష్టపడ్డాడు అనేది సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నారు. 

47

ఇక ఓ నెటిజన్ ఈసినిమా గురించి ట్వీట్ చేస్తూ.. విక్రమ్ గురించి ప్రస్తావించాడు. ప్రతి ప్రాజెక్ట్‌కి విక్రమ్  అంకితభావం అద్భుతం అన్నాడు. ఆయన ఇంతలాఎలా చేయగలడు.. ప్రతీ సినిమాకు కొత్త దనం చూపించాలని చూస్తాడు. అది అందరికి సాధ్యం కాదు. అందుకే విక్రమ్ కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు. విక్రమ్ నటన అద్భుతమని.. మాళవిక డాన్స్ తో పాటు. డీ గ్లామర్ రోల్ బాగా చేసిందని మరో ఆడియన్స్ ట్వీట్ చేశారు. 

57
Vikrams Thangalaan again postpones film release update out

ఫస్ట్ హాఫ్ సినిమాలో విక్రమ్ నటన వేరే లెవల్ లో ఉంది. అటు మాళవిక నటన కూడా అద్భుతంగా ఉంది. సెకండ్ హాప్ లో విక్రమ్ బాడీలాగ్వేజ్.. చూస్తున్న ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందట. ఫైట్ సీన్స్ అయితే కన్నార్పకుండా చూసేశాం అంటున్నారు ట్విట్టర్ జనాలు. అంతే కాదు జీవీ ప్రకాశ్ అందించి మ్యూజిక్ కట్టిపడేసిందంటున్నారు. సెంటిమెంట్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏడిపించిందంటున్నారు. 

67
Thangalaan movie

మరీ ముఖ్యంగా తమిళ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. విక్రమ్ పాత్ర కూడా వారికి బాగా నచ్చుతుంది. అందుకే ఈసినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ ఖాయంగా కనిపిస్తుంది. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు.. ఈసినిమా విషయంలో ఎలాంటి రెస్పాన్స్ ను చూపిస్తారో చూడాలి. 
 

77

అటు ఉమర్ సంధు లాంటి వివాదాస్పద క్రిటిక్ కూడా ఈసినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇచ్చేశారు. తమిళ ఆడియన్స్ ప్రేమించే సినిమాను విక్రమ్ తీసుకొచ్చారు. విక్రమ్ నటన టెర్రిఫిక్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తంగలాన్ తమిళనాటు హిట్టే..మరి తెలుగు ఆడియన్స్ ఏం చేస్తారో చూడాలి. 
 

click me!

Recommended Stories