`మిస్టర్‌ బచ్చన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Aug 15, 2024, 1:01 AM IST

మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ `మిస్టర్‌ బచ్చన్‌` నేడు విడుదలైంది. మరిఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

మాస్‌ మహారాజా రవితేజని ఇటీవల వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఒక్క హిట్‌ పడితే మూడు ఫ్లాప్‌లను చవిచూడాల్సి వస్తుంది. ఆ మధ్య `ఈగల్‌` చిత్రంతో అలరించిన ఆయన కమర్షియల్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఇప్పుడు `మిస్టర్‌ బచ్చన్‌` అనే సినిమాని చేశాడు. ఇది హిందీలో హిట్‌ అయిన `రైడ్‌` సినిమాకి రీమేక్‌. ఐటీ రైడ్‌ ప్రధానంగా యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రవితేజ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15(గురువారం) విడుదలైంది. మరి ఈ సినిమా రవితేజకి హిట్‌ ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
మిస్టర్‌ బచ్చన్‌(రవితేజ) నాన్న(తనికెళ్ల భరణి)కి అమితాబ్‌ బచ్చన్‌ అంటే ప్రాణం. `షోలే` చిత్రంలో ఎన్నోసార్లు చూశాడు. అందులోని పాత్రలకు ఫిదా అయి ఆ పాత్రలనే తన ఫ్యామిలీలో అందరికి పేర్లు పెడతాడు. అలా కొడుక్కి మిస్టర్‌ బచ్చన్‌ అని పెడతాడు. ఆయన సిన్సియర్‌ ఐటీ అధికారి. ఆ సిన్సియారిటీ కారణంగా తరచూ సస్పెన్స్ కి గురవుతుంటాడు.  అలా ఓ నాయకుడిపై రైడ్‌ చేయగా, సస్పెన్షన్‌కి గురవుతాడు. దీంతో ఇంటికి వచ్చి ఊర్లో సరదాగా గడుపుతుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి పాటల క్యాసెట్లు రికార్డు చేయడంతోపాటు స్వతహాగా ఆర్కేస్ట్రా నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో జిక్కి(భాగ్యశ్రీ బోర్సే) పరిచయం అవుతుంది. ఆమెకి తొలిచూపులోనే పడిపోతాడు. ఆమెతో లవ్‌ ట్రాక్ నడిపిస్తున్న క్రమంలో వీరి మ్యాటర్‌ ఇంట్లో తెలిసిపోతుంది. జాబ్‌ లేదు, ఏం లేదు, ఎలా పిల్లని ఇవ్వాలని జిక్కి పేరెంట్స్ అడగడంతో అదే సమయంలో తన సస్పెన్సన్‌ ఎత్తేస్తున్నట్టు చెప్పి పై అధికారుల నుంచి ఫోన్‌ వస్తుంది. నెక్ట్స్ రైడ్‌ బిగ్‌ షాట్‌, అత్యంత క్రూరమైన వ్యక్తి ముత్యాల జగ్గయ్య(జగపతిబాబు)పై చేయాలనే ఆర్డర్‌ వస్తుంది. ఆయన ఇంటికెళ్లగా ఏం దొరకలేదు. దీంతో రూట్‌ మారుస్తాడు మిస్టర్‌ బచ్చన్‌. మరి ఆ కొత్త ప్లానేంటి? జగ్గయ్య ఇంట్లో అసలు ఏం దొరికాయి? దాన్ని ఆపేందుకు జగ్గయ్య ఏం చేశాడు, దాన్ని మిస్టర్‌ బచ్చన్‌ ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ. 


విశ్లేషణః 

ప్రస్తుతం రీమేక్‌ సినిమాలకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది. ఓటీటీలు విస్తరించడంతో, డిజిటల్‌ రంగం పెరగడంతో పాన్‌ ఇండియా సినిమాల జోరు నడుస్తున్న నేపథ్యంలో రీమేక్‌లకు పెద్దగా ఆదరణ లేదు. ఇటీవల రీమేక్‌గా వచ్చిన చాలా సినిమాలు బోల్తా కొట్టాయి.  ఈ క్రమంలో రవితేజతో హరీష్‌ శంకర్‌ `మిస్టర్‌ బచ్చన్`తో ఓ సాహసం చేశాడు. అయితే ఇందులో చాలా వరకు తెలుగు ఫ్లేవర్‌ యాడ్‌ చేసి తెరకెక్కించారు. మార్పులు చేయడంలో సక్సెస్‌ అయిన హరీష్‌శంకర్‌..సినిమాని అంతే ఆసక్తికరంగా, ఎంటర్‌ టైనింగ్‌గా తెరకెక్కించే విసయంలో ఆయన పూర్తిస్థాయిలో సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. కమర్షియల్‌ అంశాలను గట్టిగా దట్టించిన హరీష్‌.. కథనాన్ని ఇంట్రెస్టింగ్‌గా నడిపించడంలో సత్తా చాటలేకపోయాడు. ఓ దశలో ఆయన కన్‌ఫ్యూజ్‌కి గురయ్యాడని అర్థమవుతుంది. సినిమా ప్రారంభంలో రవితేజ ఎంతటి సిన్సియర్‌ ఐటీ అధికారినో చూపించారు. అంతలోనే ఆయన సస్పెన్స్‌ కి గురై ఇంటికి వెళ్లిపోవడం, అక్కడ హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌, అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల ట్రాక్‌, డైలాగులు, మిస్టర్‌ బచ్చన్‌ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వెల్లడించారు. ముఖ్యంగా హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. అయితే ఫస్టాఫ్‌ మొత్తం రెట్రో ట్రాక్‌తో హిలేరియస్‌గా నవ్వించే ప్రయత్నం చేశాడు. క్రేజీగా డీల్‌ చేశాడు. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ బాగా ఆకట్టుకుంటుంది. 
 

ఇంటర్వెల్‌ సమయానికి విలన్‌ పాత్ర ఎంట్రీ, రవితేజకి ఉద్యోగం రావడం, జగపతిబాబుపై రైడ్‌కి దిగడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడేఅసలు పరీక్ష మొదలైంది. జగపతి బాబు, రవితేజ పాత్రల మధ్య సవాళ్లతో  నడిపించి ఇంటర్వెల్‌ ఇచ్చారు. సెకండాఫ్‌ మొత్తం రైడింగ్‌కి సంబంధించిన సీన్లే ఉంటాయి. గంటకు పైగా ఆ రైడింగ్‌ సీన్లనే చూపించడం, నిజాలు బయటకుతెప్పించేందుకుచేసే ప్రయత్నాలు బోరింగ్‌గా సాగాయి. సెకండాఫ్‌ని ఎలా డీల్‌ చేయాలో హరీష్‌ కన్‌ఫ్యూజ్‌ అయ్యాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. అయితే ప్రీ క్లైమాక్స్ టైమ్‌లో హీరో సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ అప్పీయిరెన్స్ మెయిన్‌ హైలైట్‌. ఆ ట్రాక్‌ నవ్విస్తుంది. మరోవైపు హీరోయిన్‌ గ్లామర్‌ యాంగిల్‌ని బాగా చూపించాడు. సినిమాకి ఈ రెండు మెయిల్‌ హైలైట్‌. దీంతోపాటు పాటలు మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఈ మూడు అంశాలు బాగున్నాయి, సినిమాగా చూసినప్పుడు దర్శకుడు హరీష్‌ చాలా లాజిక్స్ మిస్‌ అయ్యాడు.సెకండాఫ్‌ని బోరింగ్‌గా తెరకెక్కించాడు. సినిమాలో లవ్‌ ట్రాక్‌ తప్పిదే ఏదీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు, అదే బిగ్గెస్ట్ మైనస్‌. దీనికితోడు రొటీన్‌ సీన్లతో విసిగెత్తించాడు. ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. రైడింగ్‌కి సంబంధించిన మినిమమ్‌ లాజిక్స్ కూడా ఫాలో అయినట్టు అనిపించలేదు. దీంతోపాటు రైడింగ్‌ కి సంబంధించిన ట్రాక్‌ సాధారణ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కడు. కానీ సినిమాలో దానికే ప్రయారిటీ ఇవ్వడంతో అదే పెద్ద మైనస్‌ అవుతుందని చెప్పొచ్చు.  
 

నటీనటులుః 
మిస్టర్‌ బచ్చన్‌ పాత్రలో రవితేజ అదరగొట్టారు. కొట్టిన పిండి లాంటి పాత్రలో అలరించారు. అంతేకాదు వింటేజ్‌ రవితేజని చూపించారు. బిగ్‌ బీ మేనరిజంతో అదరగొట్టారు. రవితేజ మార్క్ మెరుపులు ఆకట్టుకుంటాయి. హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సే గ్లామర్‌కే పరిమితం చేశారు. కానీ సరికొత్త గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆమె అందాలు సినిమాకి మెయిన్‌ ఎట్రాక్షన్‌. జగ్గయ్య పాత్రలో జగపతిబాబు అదరగొట్టాడు. పాత్రకి ప్రాణం పోశాడు. కానీ ఆ పాత్రకి ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌ అంతగా అనిపించలేదు. సచిన్‌ ఖేడ్కర్‌, శుభలేఖ సుధాకర్‌ వంటి వారు తమదైన నటనతో మెప్పించారు. ప్రవీణ్‌, రోహిణి, చమ్మక్‌ చంద్ర, ప్రభాస్‌ శ్రీనులు కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు.

టెక్నీషియన్లుః 
మిస్టర్‌ బచ్చన్‌ సినిమాకి టెక్నీషియన్లు మెయిన్‌ అసెట్‌గా నిలిచారు. అయనంక బోస్‌ కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌ లావిష్‌గా ఉంది. అందంగా ఉంది. లొకేషన్లని చూపించిన తీరు ఆకట్టుకుంది. అలాగే సినిమాకి మరో పెద్ద అసెట్‌ మ్యూజిక్‌, మిక్కీ జే మేయర్ మరో స్టయల్‌ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. తన ఇంపాక్ట్ చూపించాడు. ఎడిటర్‌ ఉజ్వల్ కులకర్ణి..సెకండాఫ్‌ని బాగాట్రిమ్‌ చేయాల్సింది. పీపుల్స్ మీడియా రాజీపడకుండా నిర్మించారు. కాకపోతే పెద్దగా బడ్జెట్‌ పెట్టించేలా లొకేషన్లు లేకపోవడం గమనార్హం. ఇక ఫైనల్‌గా హరీష్‌ శంకర్‌ రీమేక్‌ని డీల్‌ చేయడంలో దిట్ట, కానీ ఈసారి అంతగా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు. ఏదో మెరుపులు మెరిపించారు తప్ప కనెక్ట్ అయ్యేలా అవిలేవు. ఎమోషన్స్ మిస్‌ అయ్యింది. సీన్లుగానే మిగిలిపోయింది. సీన్లు కొన్ని వర్కౌట్‌ అయ్యాయి. కొన్ని కాలేదు. మొదటి భాగం మాదిరిగానే సెకండాఫ్‌ని డీల్‌ చేస్తే సినిమా ఫలితం బాగుండేది. ఇప్పుడిది రొటీన్‌ మూవీల జాబితాలో చేరిపోతుంది. 

ఫైనల్‌గాః `మిస్టర్‌ బచ్చన్‌` సక్సెస్‌ కాని రైడ్‌.. 

రేటింగ్‌ః 2
 

Latest Videos

click me!