డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. రామ్ పోతినేని రఫ్ఫాడించాడు, పూరి కంబ్యాక్ ఇచ్చినట్లేనా

First Published | Aug 15, 2024, 4:24 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. రామ్ పోతినేని ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. ఇక పూరి జగన్నాధ్ కి అయితే ఈ చిత్రం అత్యంత కీలకం. 

ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి కాబట్టి.. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జంటగా కావ్య థాపర్ నటించింది. 162  నిమిషాల నిడివి ఉన్న చిత్రం రామ్ చిన్ననాటి సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. 


ఆ తర్వాత సంజయ్ దత్ బిగ్ బుల్ పాత్రని యాక్షన్ సీన్ తో పరిచయం చేస్తారు. చిన్న ట్విస్ట్.. వెరైటీగా అనిపించే ఫైట్ తో రామ్ పోతినేని స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా నెమ్మదిగా సాగుతుంది. పూరి జగన్నాధ్ రామ్ పోతినేని ఎనెర్జీని హైలైట్ చేస్తూ సన్నివేశాలు తెరకెక్కించారు అని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు. 

ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. పూరి జగన్నాధ్ తన స్ట్రెంత్ పై ద్రుష్టి పెట్టారు. ఫస్ట్ హాఫ్ ని రామ్ ఎనెర్జీ కాపాడింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పాక్షికంగా వర్కౌట్ అయింది అంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉంది. సెకండ్ హాఫ్ లో పూరి జగన్నాధ్ మార్క్ డైలాగులు, ట్విస్ట్ లు, మదర్ సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయ్యాయి అని ట్వీట్ చేసారు. 

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మణిశర్మ అదరగొట్టేశారు. సినిమాకి ఆయన ప్రాణం పోశారు. సాంగ్స్ కొన్ని మాత్రమే బావున్నాయి. కానీ బిజియం మాత్రం అదిరిపోయింది అని ట్విట్టర్ లో ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రానికి మైనస్ ఏదైనా ఉందంటే ఆది ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు.. అదే విధంగా అలీ కామెడీ అని అంటున్నారు. 

మరికొందరు మాత్రం లైగర్ కంటే బావుంది అంతే.. గొప్ప సినిమా కాదు. పూరి ఇంకా బెటర్ గా కంబ్యాక్ ఇవ్వాలి అని అంటున్నారు. ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి పర్ఫెక్ట్ హిట్ టాక్ అయితే రావడం లేదు. అంతా రామ్ ఎనెర్జీ, మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయితేనే పూరి జగన్నాధ్ కంబ్యాక్ ఇచ్చినట్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!