లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య.. `తండేల్‌` వచ్చేది అప్పుడే !

Published : Nov 05, 2024, 05:37 PM IST

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన `తండేల్‌` సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చింది. ప్రేమికులకు ట్రీట్‌ ఇచ్చేందుకు ఈ సినిమా రాబోతుండటం విశేషం.   

PREV
15
లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య.. `తండేల్‌` వచ్చేది అప్పుడే !

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి ప్రస్తుతం `తండేల్‌` సినిమాలో నటిస్తున్నారు. `లవ్‌ స్టోరీ` తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా టీమ్‌ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్బంగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు నిర్మాత అల్లు అరవింద్‌. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

తండేల్‌` సినిమాని ప్రేమికుల ట్రీట్‌గా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు అనే విషయం తెలిసిందే. కానీ ఫిబ్రవరి 7 నుంచే ఆ ప్రేమికుల రోజు హడావుడి స్టార్ట్ అవుతుంది. లవర్స్ అంతా ఆ హడావుడిలో ఉంటారు. ఆ సమయంలో వచ్చే సినిమాలకు బాగా డిమాండ్‌ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని `తండేల్‌` సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసినట్టు తాజాగా అల్లు అరవింద్‌ తెలిపారు. 
 

35

లవర్స్ ని టార్గెట్‌ చేస్తూ ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా కూడా లవ్‌ స్టోరీ ప్రధానంగానే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోస్టల్ ఏరియాలో మత్య్సకారుడి ప్రేమని ప్రతిబింబించేలా ఈ మూవీని తెరకెక్కించారు చందూ మొండేటి. యాక్షన్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఉండబోతుంది. ఊరమాస్‌ ఎలిమెంట్లకు కొదవ లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక టీజర్‌, ట్రైలర్ల కోసం ఆడియెన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్‌ డేట్‌కి సంబంధించి తాజాగా క్లారిటీ ఇచ్చింది టీమ్‌. 
 

45

అయితే ముందుగా ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ వర్క్ కంప్లీట్‌ కాకపోవంతో డిలే అయ్యింది. ఆ తర్వాత డిసెంబర్‌ 20న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కూడా సెట్ కాలేదు. సంక్రాంతికి రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని, తాము పండక్కి రావాలని అనుకోలేది తెలిపారు అల్లు అరవింద్‌. ప్రేమికులకు కలిసి వచ్చేలా ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు. సినిమాకి రిలీజ్‌ డేట్‌, బజ్, హైప్‌ కొంత పనిచేస్తాయని, కానీ సినిమాలో ఉండే కంటెంట్‌ మెయిన్‌గా ఉంటుందని, కంటెంట్‌ బాగుంటే దాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు అల్లు అరవింద్‌. 
 

55

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణగా తీసుకుని `తండేల్‌` సినిమాని రూపొందించినట్టు తెలిపింది టీమ్‌. ప్రేమ, యాక్షన్, డ్రామా, అద్భుతమైన భావోద్వేగాల సమ్మేళనంగా సినిమా ఉండబోతుందని టీమ్‌ తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్‌ డేట్‌ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ అదిరిపోయింది.

సాయిపల్లవిని ఘాఢంగా హత్తుకుని ఉన్నాడు నాగచైతన్య. సముద్రంలో అలల మధ్య ఈ ఇద్దరి తమ ప్రేమని చూపించడం విశేషం. ఈ పోస్టర్‌ విజువల్‌ వండర్‌గా ఉంది. ఈ సినిమాకి ప్రేమ, ఎమోషన్స్ యాక్షన్‌తోపాటు విజువల్స్ కూడా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండబోతున్నాయని ఈ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది టీమ్‌. 

read more: సావిత్రిపై మనసు పడ్డ పొలిటీషియన్‌.. ఆయన వల్లే మహానటి జీవితం నాశనం అయ్యిందా? సంచలన నిజాలు
 

also read: చిరంజీవిపై కసితో అన్నం మానేసిన బాలయ్య, చివరికి ఎన్బీకే డాన్స్ నే మెగాస్టార్‌ రీమిక్స్ చేసిన పరిస్థితి

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories