సావిత్రిపై మనసు పడ్డ పొలిటీషియన్‌.. ఆయన వల్లే మహానటి జీవితం నాశనం అయ్యిందా? సంచలన నిజాలు

First Published Nov 5, 2024, 3:38 PM IST

మహానటి సావిత్రి తన భర్త, దిగ్గజ నటుడు జెమినీ గణేషన్‌ చేసిన మోసం కారణమని అంతా అనుకుంటారు. కానీ ఆమె జీవితం నాశనం కావడానికి మరో కారణం ఉంది. ఓ పొలిటీషియన్‌ కారణమా?
 

Savitri

సావిత్రి గురించి వర్ణించే ఒకే ఒక పదం మహానటి. అది తప్ప మరే పదం ఆమె గొప్పతనాన్ని, గొప్పనటనని చెప్పడానికి చాలదు. అందుకే వెండితెర మహానటిగా వర్ధిల్లుతుంది సావిత్రి. ఆమె సినిమాల్లోకి వచ్చి మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను శాషించింది. 1950-80 వరకు సావిత్రి ఎరగా పిలిపించుకుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

సావిత్రి లేకపోయినా, ప్రతి రోజు, ప్రతి నిమిషం ఆమెకి సంబంధించిన ఎక్కడో చోట, ఏదో రూపంలో ఆమెకి సంబంధించిన డిస్కషన్‌ జరుగుతూనే ఉంటుంది. ఆమె సినిమాల ద్వారా ఇంకా చిరంజీవిగానే ఉన్నారు. కటిక పేదరికం నుంచి వచ్చిన సావిత్రి సినిమాల్లోకి వచ్చిన అతని కాలంలోనే స్టార్‌ అయిపోయింది. లేడీ సూపర్‌ స్టార్‌గా వెలిగింది. అద్బుతమైన నటనతో మెప్పించింది. దిగ్గజాలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌లను సైతం డామినేట్‌ చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరో స్టార్‌ నటుడు జెమినీ గణేషన్‌ తనని ప్రారంభంలో లైఫ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత తననే లైఫ్‌ పార్టనర్ గా చేసుకున్నారు. అనంతరం సావిత్రి జీవితం అతలాకుతలం కావడానికి కారణమయ్యాడు. 
 

Latest Videos


Savitri

అయితే సావిత్రి జీవితం జెమినీ గణేషన్‌ వల్లే నాశనమైందని అనుకుంటారు. కానీ ఆయన ఒక్కడే కాదు, అన్నీ కోల్పోయి రోడ్డుమీదకు రావడానికి జెమినీ గణేషన్‌కి సంబంధం లేదు. అందుకు కారణం మరో వ్యక్తి ఉన్నాడట. ఆ సంచలన నిజాలు బయటకు వచ్చాయి. మరో పొలిటీషన్‌ కారణంగా సావిత్రి జీవితం నాశనమైందట. ఆయన సావిత్రిపై మనసు పడటమే అందుకు కారణమని సావిత్రి వద్ద పనిచేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఇమంధి రామారావు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన సంచలన నిజాలను వెల్లడించారు. సావిత్రితో తనకు మంచి ర్యాపో ఉండేదట. 
 

జెమినీ గణేషన్‌.. సావిత్రిని మూడో భార్యగా చేసుకున్నాడట. అప్పటికే ఆయనకు అలిమేలు, పుష్పవల్లి ఉన్నారని, మొదట సావిత్రికి తెలియదని, ఆ తర్వాత తెలిసినా ఏం చేయలేకపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సావిత్రి లైఫ్‌ డిస్టర్బ్ కావడానికి జెమినీ గణేషన్‌ మాత్రమే కాదు, మరో రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడని తెలిపారు. జెమినీ గణేషన్‌తో గొడవ అనంతరం ఒంటరిగానే ఉంటుంది సావిత్రి. భారీగా ఆస్తులున్న నేపథ్యంలో మహారాణిలా రాజభోగాలు అనుభవించింది. ఆ సమయంలోనే ఓ పొలిటీషియన్‌ ఆమెపై కన్నేశాడట. తనని లోబరుచుకోవాలని చూశాడట. అందుకు సావిత్రి నో చెప్పిందట. దీంతో తనపై కక్ష్య కట్టాడని, అందువల్లే తనపై  ఐటీ రైడ్స్ జరిగాయని తెలిపారు సీనియర్‌ జర్నలిస్ట్ రామారావు. 
 

అప్పటికీ సావిత్రికి సపోర్ట్ గా ఉండేవాళ్లు ఎవరూ లేరు. జెమినీ గణేషన్‌ పట్టించుకోలేదు. దీంతో ఒంటరైపోయింది. ఐటీ రైడ్స్ చేసి మొత్తం ఆస్తులన్నీంటిని పట్టుకుపోయారు జప్తు చేశారు. దీంతో రోడ్డుమీదకు వచ్చేసింది. తన ఆస్తి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు, తాను ఎంతమందికి డబ్బు ఇచ్చిందో కూడా తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా మోసం చేశారు. అటు భర్త మోసం, ఇటు పొలిటీషన్‌ కక్ష్య, చుట్టూ ఉన్న వాళ్లు మోసం, నా అనే వాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మందుకు బానిసైంది. ఆ తర్వాత ఆసుపత్రిలో పడి కోమాలోకి వెళ్లి కొన్నాళ్ల తర్వాత కన్నుమూసింది. చాలా దారుణమైన స్థితిలో ఆమె తుదిశ్వాస విడిచారని జర్నలిస్ట్ వెల్లడించారు. ఓయూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు తెలిపారు. 
 

మరి ఈ సీనియర్‌ జర్నలిస్ట్ చేసినట్టు ఆ పొలిటీషియన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారిది. రాజకీయ అధినేత, అధికారంలో ఉన్న నాయకుడు ఇవన్నీ చేశాడని ఆయన చెప్పారు. మరి ఆయన ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఆ సమయంలో అటు ఎంజీఆర్‌, ఇటు కరుణానిధి సీఎంగా వ్యవహరించారు. వీరిద్దరిలో ఎవరైనా ఉన్నారా? ఎంజీఆర్‌ కారణమా? అనే డౌట్స్ వస్తున్నాయి. 

read more: చిరంజీవిపై కసితో అన్నం మానేసిన బాలయ్య, చివరికి ఎన్బీకే డాన్స్ నే మెగాస్టార్‌ రీమిక్స్ చేసిన పరిస్థితి

also read: నాగచైతన్య పెళ్లికి కొత్త వేదిక.. దానికి భయపడే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడా?
 

click me!